శ్రీరెడ్డి ఎపిసోడ్ లో ఆ నటి ఓవరాక్షన్

Updated By VankayaMon, 04/16/2018 - 16:32
Tollywood Gossip

శ్రీరెడ్డి ఇష్యూ లో నిజంగా వస్తున్న బాధితులతో పాటు ఆ ముసుగులో తమకు తాము పబ్లిసిటీ చేసుకునే ఆశతో వస్తున్న వాళ్ళకు కూడా కొదవలేదు. పైగా ఈ విషయం గురించి ఎవరు మాట్లాడతామన్నా గంటల తరబడి స్టూడియోలలో కూర్చోబెట్టి ఫ్రీ ప్రచారం ఇచ్చేందుకు న్యూస్ ఛానల్స్ పోటీ పడుతూ ఉండటంతో స్వార్థంతో లబ్ది పొందాలని చూస్తున్న వాళ్ళకు ఇది పండగలా అనిపిస్తోంది.

ఇక విషయానికి వస్తే శ్రీరెడ్డికి తానో గొప్ప మద్దతు ఇస్తున్నట్టు నటిస్తున్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించే ఈ టాపిక్. ఆవిడ నగరంలో అవుట్ స్కర్ట్స్ తరహాలో ఉండే ఏరియాలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో ఉంటోంది. ప్రతి శనివారం అక్కడ మందు పార్టీలు, అమ్మాయిల రాకపోకలు, పెద్ద మనషుల్లా కనిపించే వాళ్ళు వచ్చిపోవడం చాలా సాధారణ విషయం.

అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఒక సినీ రచయిత ద్వారా ఈ విషయం తెలిసింది. ఆయన మాటల ప్రకారం శ్రీరెడ్డికి మద్దతుగా చాలా గొప్పగా నీతి వ్యాక్యాలు చెబుతూ మైకు ముందు అపూర్వమైన నటన ప్రదర్శిస్తున్న ఆవిడ గురించి అందరికీ తెలుసనీ, ఒకదశలో ఆవిడ వల్ల న్యుసెన్స్ ఎక్కువైతే మీటింగ్ పెట్టి మరీ అభ్యంతరం వ్యక్తం చేస్తే కనీసం లెక్క కూడా చేయలేదని చెప్పారు.

ఇండస్ట్రీకి అమ్మాయిలను సప్లై చేయటంలో ఈవిడ ఎప్పటి నుంచో యాక్టివ్ గా ఉందని ఇప్పుడు సడన్ గా మహిళల హక్కుల గురించి నీతి మాటలు చెబుతుంటే తమకు చాలా కామెడీగా అనిపిస్తోందని ఆయన చెప్పడం విశేషం. శ్రీరెడ్డి బట్టలు విప్పకముందే పరిశ్రమకు పదిహేనేళ్ళ క్రితమే వచ్చిన ఈవిడ ఎప్పుడో నోరు విప్పాల్సిందని ఇప్పుడు తుఫాను వచ్చినట్టు అంతా మీద వేసుకుని పెద్దరికం నటిస్తున్న ఆవిడ ట్రాప్ లో పడకండి అని జూనియర్ ఆర్టిస్టులకు ఆయన సలహా ఇస్తున్నారు.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE