అఖిలప్రియ మళ్లీ గెలవదు.. ఛాలెంజ్!

Updated By VankayaTue, 02/13/2018 - 18:30
Akhila priya will not wine next time

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియపై ఆ పార్టీలో నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. మంత్రి తీరును ఖండిస్తూ టీడీపీ వాళ్లే విరుచుకుపడుతూ ఉన్నారు. సొంత నియోజకవర్గంలోనే అఖిలప్రియకు ఇలాంటి ఎదురుగాలి వీస్తోంది. మంత్రి తీరును ఖండిస్తూ.. అనేక మంది ఇప్పటికే అసహన స్వరాలు వినిపించారు. అఖిలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశాడు. ఈయన అయితే సూటిగా.. అఖిలప్రియ మళ్లీ గెలవడం జరగదు అని అంటున్నాడు. ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారాయన.

అఖిలప్రియ తీరు ఏ మాత్రం సమంజసంగా లేదు అని.. ఇలాగే ఆమె రెచ్చిపోతూ ఉంటే ఆమె ఆళ్లగడ్డలో మళ్లీ గెలవదని ఈ సీనియర్ పొలిటిషియన్ అంటున్నాడు. ఇలా అఖిలప్రియ తీరును బాహాటంగా వ్యతిరేకిస్తున్న వాళ్లలో రాంపుల్లారెడ్డి ఒకరు. ఇలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. భూమా నాగిరెడ్డికి సన్నిహితులతోనూ అఖిలకు విబేధాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నేళ్లూ మామా.. మామా.. అని పిలిచిన వ్యక్తుల మీదే ఇప్పుడు అఖిలప్రియ మండి పడుతోంది.

ఇక సొంత మేనమామ తో కూడా ఆమెకు విబేధాలు అనే ప్రచారం గట్టిగా సాగుతోంది. తన తీరుతో ఇలా చాలా మందిని శత్రువులుగా మార్చుకొంటూ వస్తోంది అఖిలప్రియ. ఇది వరకూ కూడా ఈమె తీరు వివాదస్పదం అయ్యింది. తన తండ్రికి ఏమైనా అయితే అది చంద్రబాబు బాధ్యతే అని ప్రకటన చేసిన అఖిలప్రియ, తీరా భూమా నాగిరెడ్డి మరణించాకా మాత్రం చంద్రబాబును ప్రశంసిస్తూ వచ్చింది. అయితే నంద్యాల్లో సానుభూతి, తెలుగుదేశం పార్టీ ధనబలం దెబ్బకు టీడీపీ గెలవడంతో అఖిలప్రియ మరింతగా రెచ్చిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్లే ఈమె తీరును బాహాటంగా వ్యతిరేకిస్తూ, ఆమె మళ్లీ గెలవదని అంటున్నారు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE