అమెరికా సెక్స్ రాకెట్ లో హీరోయిన్ పై ఐదేళ్ళ నిషేదం

Updated By VankayaTue, 06/19/2018 - 12:45
America BAN

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ప‌లువురు హీరోయిన్లు డ‌బ్బుల‌కోసం , మ‌రికొంద‌రు బ‌ల‌వంతంగా వ్య‌భిచార కూపంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. యాంక‌ర్లు, హీరోయిన్ల‌తో సెక్స్ రాకెట్ నిర్వ‌హిస్తున్నార‌నే ప‌క్క ఆధారాల‌తో టాలీవుడ్ నిర్మాత కిష‌న్ , అత‌ని భార్య‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌లో ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లు, యాంక‌ర్లు ఎంత‌మంది వ్య‌భిచారంలో పాల్గొన్నారు. ఎంత‌సేపు, ఎన్నిగంట‌లు, అందుకు ఎంత వ‌సూలు చేశారు. ఏ హోట‌ళ్ల‌ను ఆశ్ర‌యించారు అనే ఆధారాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సెక్స్ రాకెట్ లో ఏ1 బాధితురాలిపై అమెరికా రాకుండా నిషేదం విధించారు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు హీరోయిన్ అమెరికా వెళ్ళాల్సి ఉండ‌గా ఓ విమ‌నాశ్ర‌యానికి వ‌చ్చింది. అక్క‌డ పోలీసులు స‌ద‌రు హీరోయిన్ పై విధించిన ఆంక్ష‌ల్ని వివ‌రించి ..త‌మ‌దేశానికి రావొద్దంటూ హెచ్చ‌రించారు.  దీంతో ఆ హీరోయిన్ లబొదిబొమంట ఆ రాత్రికి విమ‌నాశ్ర‌యంలో ఉండిపోంది. 

కాగా కిష‌న్ మోదుగుపుడి వ్య‌వ‌హారంలో పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా...ఏ1 బాధితురాలిగా ఉన్న హీరోయిన్ ను విచారించారు. విచార‌ణ‌లో త‌నపై విధించిన నిషేదాన్ని ఎత్తివేయాలంటూ కోరింది. అందుకు యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు విధించిన నిషేదం త‌మ చేతుల్లో లేద‌ని..అయితే పేరు బ‌య‌ట పొక్క‌కుండా చూస్తామ‌ని హామీ ఇచ్చారు.    

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE