మొన్న చాయ్ వాలా..ఇప్పుడు ప‌కోడీవాలా

Updated By VankayaWed, 02/14/2018 - 18:57
Amethi youth writes to Smriti Irani: Help me start 'pakoda' business

భార‌త్ లో ప‌కోడీలు ఊపందుకున్నాయి. హైద‌ర‌బాద్ గ‌ళ్లీ నుంచి ఢిల్లీ రాజ‌కీయ నాయ‌కుల దాకా అంద‌రూ ప‌కోడీల మంత్ర‌మే జ‌పిస్తున్నారు. దీంతో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అంతంత్ర మాత్రంగానే ఉన్న ప‌కోడీల బిజినెస్ ఊపందుకుందని న‌గ‌ర‌వాసులు గుస‌గుస‌లాడుతున్నారు. దీనికి తోడు ఓ యువ‌కుడు ప‌కోడీల బిజినెస్ పెట్టుకోవ‌డానికి లోన్ కావాలంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి  లేఖ రాయ‌డం మ‌రోసారి ప‌కోడి పాలిటిక్స్ తెర‌పైకి వ‌చ్చాయి. 

ఇటీవ‌ల పీఎం మోడీ ఓ ఇంట‌ర్వ్యూలో  మాట్లాడుతూ ప‌కోడీలు అమ్ముకుని రెండు వంద‌లు సంపాదించుకునే వ్య‌క్తిని నిరుద్యోగి అన‌లేమని అన్నారు. ఆ ప‌కోడి వ్యాఖ్య‌ల‌పై నిరుద్యోగులు , విద్యావంతులు మండిప‌డుతున్నారు. జీవితంలో స్థిర‌ప‌డాల‌ని పెద్ద‌పెద్ద చ‌దువులు చ‌దివి నిరుద్యోగులుగా ఉన్నవారు ప‌కోడీలు అమ్ముకోని బ‌త‌కాల‌ని ఎవ‌రు కోరుకోరు అంటున్నారు.  ఈ నేప‌థ్యంలో క‌ర్నాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన పీఎం మోడీ కి.. అక్కడి నిరుద్యోగులు వెరైటీగా నిరసన తెలిపారు. సభ జరుగుతోంటే.. గ్రౌండ్ బయట.. మోడీ పకోడీలు, అమిత్ షా పకోడీలు అమ్ముతూ జనం దృష్టిని ఆకర్షించారు.

యూనివర్సిటీ కాన్వొకేషన్ కు వేసుకునే.. ప్రత్యేకమైన దుస్తులు ధరించి నిరుద్యోగులు ఇలా పకోడీలు అమ్మడం.. అందరినీ ఆకర్షించింది.మొన్న‌టికి మొన్న ప‌ద్మావ‌త్ సినిమాలో రాజ్ పుత్ వంశ‌స్థుల్ని కించ‌ప‌రిచేలా డైర‌క్ట‌ర్ బ‌న్సాలీ తెర‌కెక్కించారంటూ ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఆందోళ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆ సినిమాలో ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ తినలేద‌ని ప్ర‌ముఖులు చెబుతున్నా ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ మోడీ ప‌కోడీ పాలిటిక్స్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు 
జాతీయ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాహుల్ గాంధీ త‌న ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

పీఎం మోడీ చేసిన ప‌కోడీ కామెంట్స్ కు వెట‌కారంగా త‌న దైన‌స్టైల్లో  రాహుల్ గాంధీ కౌంట‌ర్ ఇచ్చారు. కర్నాటక ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ విరామ స‌మ‌యంలో  రోడ్డు పక్కనున్న ఓ చిన్న టీ స్టాల్ లో కూచుని పకోడీ తిని టీ తాగారు. దీనిపై రాహుల్ మోడీకి కౌంట‌ర్ ఇలా ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత‌లు సెటైర్లు వేశారు.  

ఈ నేప‌థ్యంలో ఉత్తర ప్రదేశ్ అమేథికి చెందిన అశ్విన్ మిశ్రా,  కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటూ స్థానిక నేత మోసిన్ రాజాకు ఓ లేఖ రాశారు. త‌న‌కున్న స‌మ‌స్య‌ల్ని వివ‌రించి ప‌కోడీల బిజినెస్ పెట్టుకునేందుకు లోన్ కావాల‌ని పేర్కొన్నాడు. అంతేకాదు  ఆ మ‌ధ్య ఇంట‌ర్వ్యూలో  మోడీ ఇచ్చిన ప‌కోడీల బిజినెస్ త‌న‌కు న‌చ్చిందిని ఇలా చేస్తే తన కుటుంబాన్ని పోషించడమే కాక… మరో ఇద్దరు ముగ్గురికి కూడా ఉపాధి కల్పించవచ్చన్నారు.

అయితే వ్యాపారం మొదలు పెట్టేంత ఆర్థిక స్థోమత తనకు లేదన్నారు. అందుకే ప్రధాన మంత్రి ముద్ర యోజన ప‌థ‌కం కింద తనకు లోన్ మంజూరు చేయించాలని కోరారు. మోడీ ఇచ్చిన సలహా తప్పుకాదని అనుకుంటున్నానని.. సలహా ఇచ్చినట్లే ఇచ్చి బ్యాంకుల్లో లోన్ కూడా ఇప్పించాలని లేఖలో సూచించారు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE