ట్విట్టర్ ఎకౌంటు అద్దెకు ఇచ్చిన యాంకర్?

Updated By VankayaSat, 04/07/2018 - 11:41
Anchor gave twitter account to third party ?

ఆ మధ్య ఒక సెల్ ఫోన్ పగలగొట్టిన వివాదంలో ఇరుక్కుని కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా వెళ్లి అలిగి కూర్చున్న టీవీ యాంకర్ ఇటీవలే వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పుణ్యమా అని మళ్ళి లైన్ లోకి వచ్చేసింది. అందరిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఇంకెప్పుడు ఆన్ లైన్ లోకి రానని శపథం చేసి ఇంత తక్కువ టైంలో ఎలా వచ్చిందబ్బా అనే అనుమానం ఫాన్స్ కి సైతం కలిగింది.

తాను స్వయంగా ట్వీట్ చేస్తే ఏవో ఒక ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి తన బదులు ఒక మీడియా కన్సల్టింగ్ ఏజెన్సీ ద్వారా తన ఎకౌంటు లో పోస్టులు మెసేజులు పెట్టేలా ఒప్పందం జరిగిందని ఇన్ సైడ్ టాక్. దీనికి గాను నెల నెల ఫీజును ఆ యాంకర్ చెల్లించాలి. అఫీషియల్ ఎకౌంటు కాబట్టి అందులో పెట్టే ప్రతిది సదరు యాంకర్ స్వయంగా పోస్ట్ చేసింది అని ఫాన్స్ అనుకుంటారు.

ఒకవేళ ఏదైనా పోస్ట్ వల్ల వివాదం తలెత్తినా దానికి జవాబుదారి సమాధానం మొత్తం సదరు ఏజెన్సీనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట. ఒకవేళ పెట్టిన పోస్టింగ్స్ వల్ల ఏదైనా లీగల్ సమస్య ఎదురైతే దాని ఖర్చులతో పాటు యాంకర్ కు నష్ట పరిహారం చెల్లించే నిబంధన కూడా అందులో ఉందట.

మొత్తానికి తన చేతికి మట్టి అంటకుండా థర్డ్ పార్టీ ద్వారా తన ట్విట్టర్ హ్యాండిల్ ని మైంటైన్ చేస్తున్న యాంకర్ ని చూసి ఏం తెలివితేటలు అని ఆశ్చర్యం వేయక మానదు. నిజానికి తన విషయంలోనే కాదు సెలేబ్రిటీలు అధిక శాతం తమ ట్విట్టర్ హ్యాండిల్ తామే మ్యానేజ్ చేయరు. చూసేవాళ్ళకు అది వారు స్వంతంగా చేసారు అనిపించినా మధ్యలో మూడో మనిషి ఉంటాడన్నది నిజం.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE