అగ్ర నిర్మాతతో యాంకర్ జాలీ ట్రిప్

Updated By VankayaTue, 01/02/2018 - 18:56
anchor-jolly-trip-top-producer

ఆయనో అగ్ర నిర్మాత. వయసు ఆరు దశాబ్దాలు. ఆమె ఒక యాంకర్. హాట్ హాట్ పాత్రలు చేస్తూ సినిమాల్లో పేరు తెచ్చుకోవడంతో పాటు బుల్లితెరపై విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి రహస్యంగా జాలీ ట్రిప్ కోసం శ్రీలంకకు వెళ్ళడం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ నిర్మాత వారసుడు హీరోగా ఇండస్ట్రీ లోనే సెటిల్ అయినా ఇంత లేట్ వయసులో సైతం సీనియర్ ప్రొడ్యూసర్ గారి స్పీడ్ చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. తాము వెళ్ళేది ఎవరికి చెప్పకపోయినా ఒకే ట్రిప్ లో ఇద్దరు కలిసే జర్నీ చేయటం, ఇద్దరికీ షూటింగ్ లేని టైంలో ఇదంతా ప్లాన్ చేయటం పలు అనుమానాలకు అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలలో చిక్కకుండా బాగా మేనేజ్ చేసినట్టు తెల్సింది.

 

సినిమా గ్లామర్ ఇండస్ట్రీ లో ఇలాంటివి సర్వసాధారణమే కాని టాప్ రేంజ్ లో ఉన్న యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలాంటివి చేసారని తెలిసినా, చేసుండొచ్చు అనే గాసిప్ ప్రచారంలోకి వచ్చినా అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు జరుగుతోంది అదే. ఆ నిర్మాత ఎవరు, యాంకర్ ఎవరు అనేది మీ ఊహకు అంత ఈజీగా అందేది కాదు.

కాకపోతే సోషల్ మీడియా చాలా చాలా యాక్టివ్ గా ఉన్న తరుణంలో తారలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే వచ్చేసింది. గతంలో టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి ఏది చేసినా చెల్లేది కాని ఇప్పుడు అలా కాదు. క్షణాల్లో ఒక చిన్న ఫోటో కూడా ప్రపంచాన్ని చుట్టి వస్తోంది. సో జాగ్రత్తగా ఉండాల్సింది పరిశ్రమ వాళ్ళే.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE