యాంక‌ర్ సుమ ఇంట్లో విషాదం.. తుదిశ్వాస విడిచిన అత్త‌గారు

Updated By VankayaSat, 02/03/2018 - 16:01
Anchor Suma

ప్ర‌తి తెలుగోడికి సుప‌రిచిత‌మైన యాంక‌ర్ సుమ ఇంట్లో విషాదం నెల‌కొంది. సుమ అత్త‌గారు..రాజీవ్ క‌న‌కాల త‌ల్లి.. సీనియ‌ర న‌టుడు దేవ‌దాస్ క‌న‌కాల స‌తీమ‌ణి.. ప్ర‌ముఖ న‌ట శిక్ష‌కురాలైన ల‌క్ష్మీదేవి ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. గ‌డిచిన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆమె.. హైద‌రాబాద్‌లోని త‌మ స్వ‌గృహంలో గుండెపోటుగా మ‌ర‌ణించారు.

యాక్టింగ్ స్కూల్లో ఎంతోమందికి యాక్టింగ్ పాఠాలు చెప్పిన ఆమె.. కొన్ని చిత్రాల్లో న‌టించారు కూడా. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ల‌క్ష్మీదేవికి మంచిపేరుంది. త‌మ వ‌ద్ద యాక్టింగ్ పాఠాలు నేర్చుకోవ‌టానికి వ‌చ్చిన వారిని క‌న్న‌బిడ్డ‌లా చేర‌దీసిన వైనం అంద‌రూ ప్ర‌త్యేకంగా చెప్పుకుంటారు. అంతేకాదు.. మ‌ర‌ణించే ముందు వ‌ర‌కు ఫిలిం అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రిన్సిపాల్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌టం గ‌మ‌నార్హం. 

ప‌లువురికి న‌ట‌న‌లో ఓనామాలు నేర్పించిన ల‌క్ష్మీదేవి.. యాస్టారు కాపురం.. మాయ‌లోడు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. ల‌క్ష్మీదేవికి త‌న‌దైన గుర్తింపు ఉన్న‌ప్ప‌టికీ.. యాంక‌ర్ సుమ‌కు ఉన్న ఇమేజ్ ముందు త‌క్కువ‌నే చెప్పాలి. ఈకార‌ణంతోనే ఆమెను సుమ అత్త‌గారిగా ప‌రిచ‌యం చేయాల్సి వ‌చ్చింది. ఈ రోజు సాయంత్రం మ‌హాప్ర‌స్థానంలో ల‌క్ష్మీదేవి అంత్య్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా త‌న అత్త‌గారు త‌న‌ను కోడలిగా కాక.. క‌న్న‌కూతురిగా చూసుకున్నార‌ని.. ఆమెతో త‌న‌కున్న అనుబంధం గురించి చెప్పుకున్నారు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE