బాలయ్య విన్నరే కాని

Updated By VankayaTue, 02/13/2018 - 16:12
Balayya winner but?

గత ఏడాది లాగే ఈ సంక్రాంతి పోటీ రంజుగా ఉంటుంది అనుకుంటే అజ్ఞాతవాసి పుణ్యమా అని చాలా నీరసంగా మొదలైన సంగతి తెలిసిందే. మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, స్టార్ హీరో నటించిన తమిళ్ డబ్బింగ్ సినిమా ఒకేసారి వస్తున్నాయి అంటే బాక్స్ ఆఫీస్ కాసులతో కళకళలాడటం ఖాయం అనుకున్నారు. కాని దేనికి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రాలేదు అన్నది మాత్రం నిజం.

కాని ఉన్నంతలో బాలయ్య జైసింహ మెరుగ్గా వసూళ్లు రాబట్టి పెట్టుబడి-రాబడి లెక్కలో విజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో జైసింహ థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయిపోయింది. ఏదో కొన్ని మెయిన్ సెంటర్స్ లో షిఫ్ట్ చేయటం తప్పించి అన్ని చోట్ల సెలవు తీసుకున్నాడు. ఇక క్లోజింగ్ బిజినెస్ పరంగా చూసుకుంటే మొత్తం ఇప్పటి దాకా 35.86 కోట్ల షేర్ తో సేఫ్ అనిపించాడు బాలయ్య.

జరిగిన బిజినెస్ ప్రకారం సుమారు 28 కోట్లకు అమ్ముడైన జైసింహ 8 కోట్ల లాభంతో సెంటిమెంట్ ని మరోసారి ఋజువు చేసింది. కాని ఇది బాలకృష్ణ స్టామినా కు తగ్గ విజయం మాత్రం కాదు. పవన్ అజ్ఞాతవాసి దారుణంగా ఉండటం, రంగుల రాట్నం డిజాస్టర్ టాక్, సూర్య గ్యాంగ్ మనవాళ్ళకు కనెక్ట్ కాకపోవడం తదితర కారణాలు జైసింహకు ప్లస్ అయ్యాయి. లేకపోతే విడిగా చూసుకుంటే జైసింహ జస్ట్ యావరేజ్ ప్రోడక్ట్ అని ఒప్పుకోక తప్పదు.

చిన్న గీత కంటే పెద్ద గీత ఎప్పుడు పెద్దదే కనక నిజాన్ని ఒప్పుకోక తప్పదు. పోయిన సంక్రాంతికి వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కొత్త రికార్డు సెట్ చేసింది. లెజెండ్ సైతం జైసింహ కన్నా చాలా రెట్లు పైన ఉంది. సో విన్నర్ అని చెప్పుకున్నా బాలయ్య స్టామినాకు తగ్గ సక్సెస్ మాత్రం జైసింహ ఇవ్వలేదు.

balakrishna

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE