ఇదైనా నిలుస్తుందా శీను

Updated By VankayaWed, 02/14/2018 - 16:48
Bellamkonda srinivas Sakshyam First Look

హీరోగా తెరంగేట్రం చేసినప్పటి నుంచి భారీ నుంచి అతి భారీ సినిమాలు తప్ప మీడియం బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది అనేది తెలియకుండా జర్నీ చేస్తున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నాన్న సురేష్ బ్యాక్ అప్ ఉంది కాబట్టి ఇంకా ఇలా నెట్టుకొస్తున్నాడు కాని మరో హీరో అయితే ఈ పాటికి తట్టా బుట్టా సర్దుకోవలసి వచ్చేది. పేరున్న దర్శకులతో చేసినా ఇప్పటి దాకా సాలిడ్ హిట్ ఒక్కటి కూడా దక్కలేదు.

బోయపాటి శీను వెంటపడి మరీ చేయించుకున్న జయ జానకి నాయక కూడా తేడా కొట్టేసింది. తాజాగా అతను చేస్తున్న మూవీ సాక్ష్యం. డిజే సినిమాతో హాట్ బ్యూటీగా అమాంతం తన డిమాండ్ పెంచేసుకున్న పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి శ్రీవాస్ దర్శకుడు. బాలకృష్ణతో డిక్టేటర్ లాంటి కమర్షియల్ మూవీ తర్వాత డిఫరెంట్ జానర్ లో అతను చేస్తున్న సినిమా ఇదే.

అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ మూవీ సైతం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పంచ భూతలకు ప్రేమ కథకు లింక్ పెట్టి థ్రిల్లర్ తరహాలో ఈ మూవీ తీస్తున్నట్టు తెలిసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న సాక్ష్యం సమ్మర్ లో స్టార్ హీరో సినిమాల హడావిడి తగ్గాక విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది హిట్ కావడం సాయి శ్రీనివాస్ కు చాలా అవసరం. దీని తర్వాత కూడా రెండు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నప్పటికీ ఇలా హిట్ లేకుండా ఎంతో కాలం నెగ్గుకురావడం కష్టం.

గతంలో దాసరి అరుణ్ కుమార్ లాంటి హీరోలను ఇలా సినిమాల మీద సినిమాలు తీసి సెటిల్ చేసే ప్రయత్నం చేస్తే చివరికి వర్క్ అవుట్ కాక తప్పుకున్నాడు. కాని టాలెంట్ బాగానే ఉన్న సాయి శ్రీనివాస్ యాక్టింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెడితే నిలబడే లక్షణాలు ఉన్నాయి. మరి సాక్ష్యం దానికి సహాయం చేస్తుందా లేదా చూడాలి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE