అందుకే 3 గంటలు ఉంది

Updated By VankayaTue, 04/17/2018 - 10:13
Bharath Ane Nenu

కొత్త తరం ప్రేక్షకులకు ఓపిక తక్కువ. మూడు గంటల సేపు థియేటర్లో ఓపిగ్గా సినిమా చూస్తూ కూర్చోవడం అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు ఎన్ని గంటలు ఉన్నా చెల్లేది కాని ఇప్పుడు కాదు. అందుకే సాధ్యమైనంత మేరకు రెండున్నర గంటలకే ముగించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక రచయితలు. కాని అర్జున్ రెడ్డి, రంగస్థలం ఈ నమ్మకాన్ని నిలువునా బ్రేక్ చేసి పారేసాయి.

కుర్చీలో కూర్చోబెట్టే కంటెంట్ ఉంటే మూడు గంటల సేపు ఎటువంటి విసుగు లేకుండా చూస్తామని వసూళ్ళ సాక్షిగా ప్రేక్షకులు ఋజువు చేసారు. ఆ నమ్మకమే కాబోలు భరత్ అనే నేను కూడా అదే దారిలో ఉంది. సెన్సార్ పూర్తి చేసుకున్న భరత్ అనే నేను నిడివి 173 నిమిషాలుగా ఫైనల్ అయ్యింది. అంటే మూడు గంటలకు జస్ట్ ఏడు నిముషాలు మాత్రమే తక్కువ. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు సినిమా ఏదీ ఇంత లెంగ్త్ లో లేదు. అందుకే అంత మ్యాటర్ ఏముంటుందా అనే ఆసక్తి మొదలైంది. సెన్సార్ యు/ఎ ఇచ్చేసింది.

నిజానికి భరత్ అనే నేను కథలో చాలా కాన్వాస్ ఉందట. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్న హీరో వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెట్టాక సమాజంలో ఉన్న చెడు పోయి మంచి జరగాలి అంటే అధికారం తప్పనిసరి అని గుర్తించి ఆ తర్వాత సిఎంగా మారి రాష్ట్రాన్ని తన ఆలోచనలతో ఎలా మార్పు తీసుకొస్తాడు అనే దాని గురించి కథని ఫిలిం నగర్ టాక్. మొదటి గంట చాలా క్యాజువల్ గా హీరో హీరొయిన్ల పాత్రలు పరిచయం చేయటం, వాళ్ళ మధ్య ప్రేమ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని చూపించడం మొదలుపెట్టి ప్రీ ఇంటర్వెల్ ముందు ఊహించని మలుపుతో ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుంచి కొరటాల శివ వేగం పెంచుతాడని టాక్.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కథను మలుపు తిప్పడం మాత్రం తొలి గంట ముగిశాకే ఉంటుందని తెలిసింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా రేసిగా ఉంటుందని సమాచారం. అందుకే కట్ చేయకుండా ఉండే విషయంలో రంగస్థలం స్ఫూర్తిగా నిలవడం వల్లే మరో ఆలోచన చేయలేదని టాక్. మరో మూడు రోజుల్లో భరత్ అనే నేను భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE