జిఎస్టి ఎగ్గొట్టిన బడా నిర్మాత

Updated By VankayaThu, 02/22/2018 - 21:00
Big producer not paid GST

టాలీవుడ్ లో కోట్లాది రూపాయలతో వ్యవహారాలు చేసే భారీ సినిమాల నిర్మాతలకున్న ఏకైక సమస్య టాక్స్. అందుకే వసూళ్ళ గురించి వారుగా ఎక్కడా నోరు విప్పే సాహసం చేయరు. మా సినిమా ఇంత వసూలు చేసింది అని చెప్పడం ఆలస్యం వెంటనే ఐటి శాఖ దాడులు జరుగుతున్నాయి. కాని ప్రతి సారి తప్పించుకోవడం అంటే అంత ఈజీ కాదు.

తాజాగా టాలీవుడ్ కు చెందిన ఒక బడా నిర్మాత ఐటి శాఖ కన్నుగప్పి భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని గుర్తించిన జిఎస్టి సెంట్రల్ టాక్స్ కమీషనరేట్ దాదాపు ఆ లెక్కను 7 కోట్ల దాకా తేల్చిందట. గత ఆరేడు నెలల్లో మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ నిర్మాత చాలా తెలివిగా ఎకౌంట్స్ ని మేనేజ్ చేయటంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో నోటీసు అందుకున్న నిర్మాత బకాయి తీరుస్తాను అని ముందుకు వచ్చాడు. కాని చట్ట ప్రకారం ఇలా పన్ను ఎగ్గొట్టారు అని అధికారికంగా గుర్తించిన తరువాత ఊరికే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోదు. ఎందుకంటే ఎగోట్టిన పన్ను మొత్తం ఐదు కోట్ల లోపు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాని ఇక్కడ అది 7 కోట్లు కావడంతో నాన్ బెయిలబుల్ వారంట్ రావడం ఖాయం అని తెలుస్తోంది.

ఇప్పుడు పెనాల్టిగా టాక్స్ అర్హత పొందిన మొత్తంతో పాటు 18% వడ్డీ కూడా చెల్లించాలి. ఒకవేళ నేరం తీవ్ర స్థాయిలో రుజువయ్యి ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసారని తేలితే ఐదేళ్ళ దాకా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందట. సో ఆ మొత్తాన్ని కట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు నిర్మాతకు. అదే కనక జరిగితే ఆ హిట్ సినిమాల మీద సంపాదించిన మొత్తం హారతి కర్పూరం అయిపోతుంది. వేరే గత్యంతరం లేదు కనక ప్రస్తుతం డబ్బు సమకూర్చుకునే పనిలో పడ్డాడు ఆ నిర్మాత.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE