కర్ణాటకలో బీజేపీ.. చంద్రబాబుకు కోపం వచ్చింది!

Updated By VankayaThu, 05/17/2018 - 11:51
BJP in karnataka..Chandra babu serious on BJP

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మినిమం మెజారిటీని పూర్తిగా సంపాదించుకోకుండానే బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చంద్రబాబు మండిపడినట్టుగా తెలుస్తోంది. అక్కడ బీజేపీ అనుసరించిన వైఖరి పట్ల చంద్రబాబుకు కోపం వచ్చిందట. ఈ కోపాన్ని తన కేబినెట్ మీటింగులో వ్యక్త పరిచాడట చంద్రబాబు నాయుడు. తన మంత్రివర్గ సహచరుల మధ్యన చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్లపై ఫైర్ అయ్యాడని సమాచారం. బీజేపీ అనైతికంగా వ్యవహరిస్తోందని, గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు విరుచుకుపడ్డాడు అని సమాచారం.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ల కూటమికి గవర్నర్ ఛాన్స్ ఇవ్వాల్సిందని చంద్రబాబు అభిప్రాయపడ్డాడు అని సమాచారం. కేబినెట్ మీటింగులో బాబు ఈ వ్యాఖ్య చేశాడట. అయితే గవర్నర్‌ ను అడ్డం పెట్టుకుని బీజేపీ బయటపడిందని... అంటూ మొత్తం గవర్నర్‌ల వ్యవస్థనే రద్దు చేయాలని కూడా చంద్రబాబు అన్నాడట. గవర్నర్ల వ్యవస్థకు తను మొదటి నుంచి వ్యతిరేకమే అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.

మొత్తానికి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం పట్ల బాబుకు బాగా బాధ వేసినట్టుగా ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయుంటే చంద్రబాబు ఫుల్ హ్యాపీగా అయ్యేవాడేమో.

ఫలితాలు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు సోనియాగాంధీకి ఫోన్ చేశాడట. జేడీఎస్ తో చేతులు కలపాలని సూచించరట. ఇప్పుడు కూడా బాబు అదే మాటతో ఉన్నాడట.. జేడీఎస్, కాంగ్రెస్ వాళ్లు చేతులు కలిపి రాజ్ భవన్ ముందు ధర్నాకు దిగాల్సిందని చంద్రబాబు అన్నాడని సమాచారం.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE