రవసత్తరంగా కర్ణాటక రాజకీయం.. రచ్చ రచ్చ!

Updated By VankayaWed, 05/16/2018 - 10:54
BJP Reaching Out To Our Lawmakers, Claim Congress, JDS

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కన్నా ఫలితాల తర్వాతే రాజకీయం చాలా మలుపులు తిరుగుతుందని మొదటి నుంచి విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి పరిణామాలు. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు ఒక కూటమిగా ఏర్పడి క్యాంపును నడిపే ప్రయత్నాల్లో ఉండగా.. భారతీయ జనతా పార్టీ మాత్రం సీటు దక్కించుకుంటామనే విశ్వాసంతో ఉంది.

కర్ణాటక అసెంబ్ల ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్‌ను చూస్తే భారతీయ జనతా పార్టీకి 104 సీట్లు దక్కాయి. దీంతో ఆ పార్టీ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ 78 సీట్లతో రెండో స్థానంలో నిలవగా జేడీఎస్ 38 స్థానాలతో నిలిచింది. ఒక దశలో మినిమం మెజారిటీ దిశగా వెళ్లిన బీజేపీ ఆ తర్వాత మాత్రం కాస్త మందగించింది. దీంతో మినిమం మెజారిటీకి 9 సీట్ల దూరంలో నిలిచిపోయింది.

రెండు సీట్లకు ఇంకా ఎన్నిక జరగాల్సి ఉంది. వాటిల్లో ఫలితాల సంగతిని పక్కన పెడితే..  భారతీయ జనతా పార్టీ గవర్నర్ దగ్గర నుంచి సానుకూల పొందింది. బలనిరూపణకు రెండు రోజుల పాటు సమయాన్ని అడిగింది బీజేపీ. దానికి గవర్నర్ సానుకూలంగా స్పందించాడు.

ఈయన భారతీయ జనతా పార్టీ వ్యక్తే. గుజరాత్ లో బీజేపీ తరఫున చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందనే అనుకున్నారో ఏమో కానీ ఈయనను గవర్నర్ గా కర్ణాటకకు పంపారు. దీంతో ఎంతో కొంత బీజేపీకి లాభించే అంశమే అవుతుంది ఇది. స్థూలంగా కర్ణాటక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE