బాబు హయాంలో ప్రమాదాలకు ప్ర‌కృతి కారణం, వేరే వాళ్లైతే?

Updated By VankayaWed, 05/16/2018 - 15:55
Godavari river Boat Accedent

గోదావరి నదిలో బోటు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేస్తోంది. బోటు ప్రమాదానికి ప్రభుత్వం వైఫల్యం కాదు అని తెలుగుదేశం నేతలు, అభిమానులు వాదిస్తున్నారు. ఆ ప్రమాదం అంతా ప్ర‌కృతి ప్రమేయంతో జరిగింది తప్ప.. ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని వీళ్లు అంటున్నారు. ఇలాంటి ఎదురుదాడి చేస్తూ తప్పుకోవాలని చూస్తున్నారు. 

ఒకవేళ ఇది తొలి ప్రమాదం అయి ఉంటే దానికి కారణం ప్ర‌కృతే అని అనుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో అనేక బోటు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఏపీలో. కృష్ణా నదిలో బోటు ప్రమాదం, ఆ తర్వాత పర్యాటక శాఖకే చెందిన మరో బోటు అగ్నిప్రమాదానికి గురి కావడం, ఇలాంటి సంఘటనలు వరసగా చోటు చేసుకున్నాయి. అయితే అప్పటికీ ఏపీ ప్రభుత్వం మేలుకోలేదు.

ఆఖరికి కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగితే, పర్యాటక శాఖకు చెందిన బోటే మునిగిపోతే దాంట్లో మరణించిన వారిని కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారిని పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఆ తర్వాత కూడా మరో బోటు అగ్నిప్రమాదానికి గురి అయ్యింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టలేదు.

గోదావరిలో నిన్న ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత అధికారులు సకాలంలో అక్కడకు చేరుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు నాలుగు గంటలసేపు అక్కడకు ఒక్కరు కూడా రాలేదని తెలుస్తోంది. మరి దీనికి కూడా ప్ర‌కృతే కారణమా? ప్రభుత్వ వైఫల్యం లేదా? చంద్రబాబు పాలనలో ఏం జరిగినా దానికి ప్ర‌కృతి కారణం.. అదే వేరే వాళ్లు అధికారంలో ఉంటే అది ప్రభుత్వ వైఫల్యం.. ఇదీ టీడీపీకి తెలిసిన నీతి.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE