సీజనల్ లవ్ అండ్ బ్రేకప్-టీజర్ రివ్యూ

Updated By VankayaWed, 02/14/2018 - 10:35
Chal Mohana Ranga

తన అభిమాన కథా నాయకుడు పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతలుగా హీరో నితిన్ నటిస్తున్న చల్ మోహనరంగ టీజర్ ఇందాక విడుదల చేసారు. లవ్ స్టొరీ కాబట్టి వాలెంటైన్ డే గిఫ్ట్ గా దీన్ని అందించారు. ఎక్కువ వ్యవధి లేకుండా కేవలం 45 సెకండ్లు మాత్రమే ఉన్న టీజర్ లో సినిమా దేని గురించో చెప్పేసారు.

మీ లవ్ స్టొరీ ఏంటి భయ్యా అని వాయిస్ ఓవర్ లో ఒక పాత్ర అడిగితే దానికి బదులుగా నితిన్ వర్షాకాలంలో పరిచయమై శీతాకాలంలో ప్రేమగా మారి వేసవి కాలంలో బ్రేకప్ అయ్యిందని చెబుతాడు. దానికి కౌంటర్ మీరిద్దరూ వెదర్ రిపోర్టర్స్ అని అడగటం బాగా పేలింది. నితిన్ లై తర్వాత చేస్తున్న మూవీ ఇదే. ప్రయోగం కింద చేసిన లై బెడిసి కొట్టడంతో తనకు అచ్చొచ్చిన ప్రేమ కథలకే మళ్ళి వచ్చాడు నితిన్.

టీజర్ ని పక్కన పెడితే స్టొరీ లైన్ మాత్రం రొటీన్ గానే ఉందేమో అనే ఫీలింగ్ కలిగించింది. ఈ మధ్య వచ్చిన తొలిప్రేమ కూడా లవ్ అండ్ బ్రేకప్ చుట్టూ తిరిగే కథనే. ఇది కూడా అదే తరహాలో ఇద్దరు ప్రేమించుకోవడం ఆ తర్వాత యేవో కారణాల వల్ల విడిపోవడం, మళ్ళి రీ యునియన్ కావడం ఇలా అదే లైన్ లో ఉన్నట్టు అనిపిస్తోంది. ట్రైలర్ లో ఏమైనా తేడా చూపిస్తారేమో చూడాలి.

నారా రోహిత్ తో రౌడీ ఫెలో తీసిన తరువాత ఐదేళ్ళ గ్యాప్ తో దర్శకుడు కృష్ణ చైతన్య చేసిన మూవీ కావడం వల్ల ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. త్రివిక్రంను మెప్పించిన స్టొరీ అంటే టీజర్ లో చూపించింది కాకుండా సం థింగ్ స్పెషల్ ఉండే ఉంటుంది. పవన్ నిర్మాతగా ఉన్న ఏ సినిమా ఇంత వరకు సక్సెస్ కాలేదు. ఇది ఆ ట్రెండ్ ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE