పవన్ ను బాబు అలా వాడేసుకొంటున్నాడా?

Updated By VankayaWed, 02/14/2018 - 19:26
Chandra babu using pawaan kalyan like this

పవన్ కల్యాణ్ ను చంద్రబాబు వాడుకుంటున్నాడు..  ఈ మాట ఏమీ కొత్తది కాదు. మూడున్నర సంవత్సరం నుంచి వినిపిస్తూ ఉన్నదే. గత ఎన్నికల ముందే ఈ మాట మొదలైంది. ఎన్నికల సమయం అంతా వినిపించింది. ఎన్నికల తర్వాత కూడా అదే మాటే వినిపిస్తోంది. ఈ మాటపైపవన్ కూడా వివరణ ఇచ్చాడు. ఒకరు వాడుకుంటే ఉపయోగపడిపోయేంత అమాయకుడిని కాదు తను అని పవన్ చెప్పుకొచ్చాడు. మరి చంద్రబాబు చేత పవన్ అలా వాడబడుతున్నందుకు ఆయనకు దక్కుతున్న ప్రతిఫలం ఏమిటో ఎవరికీ తెలియదు.

ఇక ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు పవన్ ను చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు అనే మాటను మరొకరు మాట్లాడారు. ఆయన మరెవరో కాదు ముద్రగడపద్మనాభం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ ను వాడుకొంటూ ఉన్నాడని ముద్రగడ అంటున్నాడు. ఈ విషయంలో ఆయన బహిరంగ లేఖ కూడా రాశాడు. కేంద్రం తో అధికారాన్ని పంచుకుంటున్న చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మోడీని ప్రశ్నించడానికి మాత్రం పవన్ ను వాడుకొంటూ ఉన్నాడని ముద్రగడ అంటున్నాడు. పవన్ ఏర్పాటు చేస్తున్న జేఎఫ్ సీ విషయంలో ముద్రగడ ఇలా స్పందించాడు. అంతేకాదు.. దీని వల్ల ప్రయోజనం కూడా లేదని ఆయన తేల్చేశాడు.

రాష్ట్ర ప్రయోజనాలు పవన్ కల్యాణ్ వల్ల నెరేవేరేది ఉండదని ముద్రగడ తేల్చి చెప్పాడు. ఇప్పుడు స్పందించాల్సింది చంద్రబాబునే అని.. ఆయన కేంద్రం నుంచ వైదొలగాలి అని ముద్రగడ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు బయటకు రావాలని, తన పార్టీకి చెందిన కేంద్రమంత్రుల చేత రాజీనామా చేయించాలని.. అప్పుడు ప్రయోజనం ఉంటుందని ముద్రగడ చెబుతున్నాడు. అది చేయకుండా.. ఇంకేం చేసినా ఉపయోగం లేదని ముద్రగడ తేల్చి చెబుతున్నాడు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు వాడుకొంటున్నాడని ఈయన ఆందోళన వ్యక్తం చేశాడు. అయినా వాడబడుతున్న పవన్ కు నొప్పిలేనప్పుడు.. ఎవరు ఏమని ఏం ప్రయోజనం?

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE