బాబు గ్యాంగ్‌కు జగన్ ఫీవర్.. పతాక స్థాయికి!

Updated By VankayaThu, 05/17/2018 - 15:24
ys jagan

తెలుగుదేశం వాళ్లకు పట్టుకున్న జగన్ ఫీవర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్లకు జగన్ ఫీవర్ పతాక స్థాయికి చేరింది. వైఎస్సార్ మరణించక ముందు నుంచినే జగన్ మీద అటాక్ స్టార్ట్ అయ్యింది. జగన్ సాక్షి పత్రిక పెట్టినప్పటి నుంచి వీళ్లు విరుచుకుపడటం మొదలుపెట్టారు. అంతకు ముందు కూడా జగన్ గురించి ఉన్నవీ లేనివీ మాట్లాడటం అలవాటే. ఒక్కసారి జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీకి జగన్ టెన్షన్ పతాక స్థాయికి చేరింది. 

అక్కడ నుంచి ఇప్పటి వరకూ అది తగ్గలేదు. ఏం జరిగినా.. జగన్.. జగన్.. అంటూ మాట్లాడటం తెలుగుదేశం వాళ్లకు అలవాటుగా మారింది. తాము ఇబ్బందుల్లో పడిన ప్రతి సారీ, జగన్ నామస్మరణ చేస్తారు తెలుగుదేశం వాళ్లు. తమ అక్రమాలు బయట పడితే అది జగన్ కుట్ర అని అంటారు. ఎవరైనా తమను విమర్శిస్తే వారి వెనుక జగన్  ఉన్నాడని అంటారు. తటస్థులు ఇలా మాట్లాడినా వారి చేత జగనే మాట్లాడిస్తున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ చెప్పే మాట.

ఈ పరంపరలో టీటీడీ వ్యవహారాల పై కూడా తెలుగుదేశం పార్టీ ఇలాగే స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అరాచకాలు జరుగుతున్నాయని, బాధ్యత తెలియని వాళ్లు చైర్మన్లు అవుతున్నారని, ఆఖరికి స్వామి వారి నగలు కూడా సరిగా ఉన్నాయో లేవో తెలియడం లేదని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించడం సంచలనంగా మారింది. టీటీడీతో చంద్రబాబు ఆడుతున్న గేమ్స్ తోనే పిడుగులు, ఉత్పాతాలు సంభవిస్తున్నాయని టీటీడీ ప్రధాన అర్చకుడే అంటున్నారు. అర్చకులకు రిటైర్మెంట్ అనే ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. హిందూ సంప్రాదాయాల్లో ఈ తరహా జోక్యం ఏమిటని ఆయన ప్రశ్నించాడు.

మరి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని తెలుగుదేశం వాళ్లు రమణ దీక్షితులు వెనుక జగన్ ఉన్నాడని పాట మొదలుపెట్టారు. రమణ దీక్షితులు గతంలో వైఎస్‌కు సన్నిహితంగా ఉండేవారని, ఇప్పుడు జగన్ కు సన్నిహతుడని వీరు ఆరోపిస్తున్నారు. అయినా ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలుగుదేశం వాళ్లు ఇలా ఎదురుదాడి చేస్తూ ఉండటం వీరి వైఫల్యానికి నిదర్శనంగా మారింది.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE