సోనియాకి ఫోన్ చేసిన చంద్రబాబు? కాంగ్రెస్‌కు సాయం?

Updated By VankayaWed, 05/16/2018 - 16:01
Chandrababu gave Sonia Gandhi Goa wake-up call

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ చాలా ఆందోళన కరంగా ఉంది. మోడీ గ్రాఫ్ తగ్గింది అనేది చంద్రబాబు ప్రస్తుతం ఎత్తుకున్న పాట. అందుకే ఆయన ఆధ్వర్యంలోని ఎన్డీయే నుంచి చంద్రబాబు నాయుడు తన పార్టీని బయటకు తీసుకొచ్చాడు. ఒకవేళ మోడీకి అనుకూలత ఉంటే చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అయితే మోడీ గ్రాఫ్ తగ్గిందని లెక్కలేసిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా అంశాన్ని అడ్డం పెట్టుకుని బయటకు వచ్చాడు. అలాగే నాలుగేళ్ల తన వైఫల్యాలన్నింటికీ మోడీనే బాధ్యుడు అని కూడా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి పాలైతే చూడాలనేది చంద్రబాబు నాయుడుకు ఉండిన కోరిక. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే మోడీ కథ అయిపోయిందని ప్రచారం చేసుకోవచ్చు అని బాబు భావించాడు. అయితే అనూహ్యంగా అక్కడ భారతీయ జనతా పార్టీ గణనీయంగా సీట్లను సాధించింది. లార్జెస్ట్ సింగిల్ పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గర దగ్గరగా వచ్చింది. అయితే మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువ వచ్చాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్ పడినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదు అనేది చంద్రబాబు కోరిక. అందుకే ఈయన ఫలితాలు వస్తుండగానే సోనియాగాంధీకి ఫోన్ చేశాడట. అవకాశాన్ని వదులుకోవద్దని.. త్వర పడాలని.. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపాలని.. జేడీఎస్‌ ను కలుపుకుపోవాలని చంద్రబాబు సూచించాడట.

కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీని అధికారంలోకి రానీయకుండా చూడాలని చంద్రబాబు నాయుడు సోనియాకు చెప్పాడట. బీజేపీ అధికారంలోకి రాకూడదు అనేది చంద్రబాబు కోరిక. అందుకే సోనియాకు ఆ సూచన చేశాడట. త్వరపడాలని అన్నాడట. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి బాగా చేరువయ్యాడు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు కోరిక నెరవేరేట్టుగా లేదు. బీజేపీ వాళ్లు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE