ఆ న‌టితో 3గంట‌లు 2సార్లు రూ.2,500వేల డాల‌ర్లు

Updated By VankayaSat, 06/30/2018 - 14:05
Actress

అమెరికాలో భారీ ఎత్తున సెక్స్ రాకెట్ నిర్వ‌హించి అరెస్ట్ అయిన కిష‌న్ మోదుగుపూడి అత‌ని భార్య చంద్ర‌క‌ళ పూర్ణిమల గురించి రోజుకో వార్త సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అమెరికా చికాగోలో హీరోయిన్లు, యాంక‌ర్ల‌తో సెక్స్ రాకెట్ నిర్వ‌హిస్తున్నార‌నే ఆధారాలు వెలుగులోకి రావ‌డంతో హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేష‌న్ అధికారులు ఆ ఇద్ద‌రి దంప‌తుల‌పై 42పేజీల ఛార్జ్ షీట్ త‌యారు చేసి వారిని అరెస్ట్ చేశారు. 

ఈ నేప‌థ్యంలో కిష‌న్ భార్య చంద్ర‌క‌ళ విఠుల‌తో జ‌రిపిన చాటింగ్ వెలుగులోకి వ‌చ్చింది. నేను ధ‌న‌వంతుణ్ని కాదు. వేలాది డాల‌ర్లు ఇవ్వ‌డానికి అంటూ ప్రారంభ‌మైన ఆ సంభాష‌ణ‌లో 

విఠుడు : ఎంత‌బ‌డ్జెట్ లో ఉన్నారు. 
 
చంద్ర‌క‌ళ  :
 మీ బ‌డ్జెట్ ఎంత 

విఠుడు: సౌత్ ఇండియాకు చెందిన పొడుగుకాళ్ల  అమ్మాయి ఉందా. గ‌తంలో మీరు త‌న‌ని రెండుసార్లు అరేంజ్ చేశారు. త‌న‌ని మీరే డ్రాప్ చేశారు క‌దా. ఆ అమ్మాయికి ఎంత‌రేటో ఇప్పుడు అంతే ఇస్తా. 
 
చంద్ర‌క‌ళ‌ :
3గంట‌ల‌పాటు రెండు సార్లు రూ.2,500వేల డాల‌ర్లు అంటూ చంద్ర‌క‌ళ ముగిసింది. 

ఈ సంభాష‌ణ అంతా యూఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్న లెడ్జ‌ర్ బుక్ ల్లో, ఫోన్ డేటాలో ఉన్నట్లు తేలింది. అంతేకాదు పోలీసులు స్వాధీనం చేసుకున్న కీల‌క ఆధారాల్లో కిష‌న్ మోదుగు పూడి దంప‌తులు ఇద్ద‌రు న‌టీమ‌ణుల పేర్ల‌తో ఫేక్ లెట‌ర్ హెడ్ ల‌ను క్రియేట్ చేసి వారితో వ్య‌భిచారం నిర్వ‌హించిన‌ట్లు అక్క‌డి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెల్ల‌డించారు.  

గ‌త ఏడాది ఇద్దరు యంగ్ హీరోయిన్ల‌ను తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (TASC), ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) త‌రుపున సెల‌బ్రేష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని చెప్పి వారిని ఆహ్వానించారని , అలా ఆహ్వానించి వారితో లైంగిక కార్య‌క‌లాపాలు చేప‌ట్టిన‌ట్లు అధికారుల విచార‌ణలో తేలిన‌ట్లు స‌మాచారం.అయితే కిష‌న్ దంప‌తుల్ని అదుపులోకి తీసుకున్న అధికారులు లెట‌ర్ హాడ్స్ లో ప్రింట్ చేసిన స‌ద‌రు సంఘాల్ని విచార‌ణ జ‌ర‌ప‌గా..మా త‌రుపున ఎటువంటి కార్య‌క్ర‌మాలు జ‌ర‌ప‌లేద‌ని వారు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. 

ఆ ఇద్ద‌రు న‌టీమ‌ణులు అమెరికా నుంచి ఇండియా వ‌చ్చిన వెంట‌నే వారిలో ఒక‌రి అకౌంట్ లో రూ.14ల‌క్ష‌లు జ‌మైన‌ట్లు తేలింది. మ‌రి ఆ న‌టికి అంత పెద్ద‌మొత్తంలో ఎలా వ‌చ్చింది. ఎవ‌రు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు. అనే విష‌యాల్ని తేల్చేప‌నిలో అమెరిరాక అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు  వార్త‌లు వినిపిస్తున్నాయి.  

 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE