మొత్తం పోయిందా ఛార్మీ ?

Updated By VankayaThu, 05/17/2018 - 10:15
Charamy get total loss in Mehabooba?

పూరి జగన్నాధ్ కు పూర్వ వైభవం తెస్తుందని నమ్మి భారీ బడ్జెట్ లో తీసిన మెహబూబా రికవర్ అయ్యే అవకాశం కనుచూపు మేర కనిపించడం లేదు. సగం కూడా వెనక్కు తెచ్చే అవకాశం లేకపోవడంతో మొత్తానికే పుట్టి మునిగేలా ఉంది. పూరి కనెక్ట్ సంస్థలో పార్టనర్ షిప్ పద్ధతి మీద వర్క్ చేస్తున్న ఛార్మీ మెహబూబా మీద నమ్మకంతో తన దగ్గరున్న డబ్బు మొత్తం సుమారు 6 కోట్ల దాకా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పోయే ముప్పు పొంచి ఉందని ఫిలిం నగర్ టాక్.

పూరి కూడా తన ఆస్తులు కొన్ని అమ్మి మరీ ఇది పూర్తి చేయాల్సి వచ్చిందని ఇంతకుముందు చాలా కథనాలే వచ్చాయి. ఇప్పుడు మెహబూబా దెబ్బకు అన్ని కృష్ణార్పణం అని ఫిలిం నగర్ టాక్. దిల్ రాజు రిలీజ్ చేసినప్పటికీ ఆయన అడ్వాన్సు పద్ధతి మీద రాసుకున్నారు. అంటే ఒకవేళ సినిమా ఆడకపోతే నష్టాలు ఒరిజినల్ నిర్మాత భరించాలి. ఆ కండిషన్ మీదే తను మార్కెట్ చేసాడని తెలిసింది.

ఇప్పుడు తీరా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అనిపించుకునే రేంజ్ లో కూడా సినిమా ఆడకపోవడంతో కష్టాలు రెట్టింపు అయ్యేలా ఉన్నాయి. పూరి ఆకాష్ నటన వరకు మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ అతన్ని సోలో హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందు రావడం కష్టమే. దానికి కొంత టైం పడుతుంది. మరోవైపు మెహబూబా సక్సెస్ అయితే తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన మరోసారి తెరపైకి తెద్దాం అనుకున్న పూరికి ఆ ఆశ కూడా ఇప్పట్లో నెరవేరనట్టే. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్స్ గా పేరున్న కృష్ణ వంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్షకులు ఇలా మూస చక్రంలో ఇరుక్కుపోయి తమ వైభవం కోల్పోవడం నిజంగా బాధాకరం.

జ్యోతి లక్ష్మి సినిమా మొదలుకుని మెహబూబా దాకా పూరి సంస్థతో చక్కని అనుబంధం కొనసాగించిన ఛార్మీ ఇకపై పూరికి గుడ్ బై చెబుతుందేమో అని అనుమానిస్తున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. స్టార్ లేకుండా ఇంత బడ్జెట్ పెట్టడం పూరి చేసిన మొదటి తప్పైతే కథనం మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం దేశభక్తి అనే థ్రెడ్ మీద రెండు మూడు సీన్లు రాసుకుని వాటితోనే సినిమా ఆడేస్తుంది అనుకోవడం అసలు తప్పు. ఏదైతేనేం ఇప్పుడు మూల్యం మాత్రం అందరూ చెల్లించాల్సిందే.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE