యువ‌తీ, యువ‌కుల‌కు ఉచిత‌ కండోమ్ ల పంపిణీ

Updated By VankayaWed, 02/14/2018 - 12:21
Condoms distributed on eve of Valentine's Day to fight HIV/AIDS

ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లు రైల్వే స్టేష‌న్ల‌లో కండోమ్ లు పంచ‌డం చ‌ర్చాంశనీయ‌మైంది. ప్రేమికులు అతిప‌విత్రంగా భావించే ఫిబ్ర‌వ‌రి 14న  ముంబై ఎహెచ్ ఎఫ్ జ్యోతీ అనే ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ వాలంటీర్లు వాషి రైల్వేష్టేష‌న్ లో యువ‌తీ , యువ‌కుల‌కు ఏడువేల కండోమ్ ల‌ను ఉచితంగా పంపిణీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌త్యేకించి వాలెంటైన్స్ డే రోజు కండోమ్ లు పంపిణీ చేయ‌డం పై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాతాము చాలా మంది హెచ్ఐవీ తో బాధ‌ప‌డుతున్న వారిని చూస్తున్నామ‌ని అలాంటి భ‌యంక‌ర‌మైన వ్యాధి రాకుండా ఉండేలా  ఉచిత‌ కండోమ్ ల‌ను పంచుతున్న‌ట్లు ట్ర‌స్ట్ వాలంటీర్లు చెబ‌తున్నారు. ఈ సంద‌ర్భంగా కండోమ్ వాడ‌కుంటే మీకు జీవితం ఉండ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

ఇదిలా ఉంటే హైద‌రాబాద్ లో ఉన్న ప్రేమికుల‌కు పోలీసులు భ‌రోసా క‌ల్పిస్తున్నారు న‌గ‌రంలో కొన్ని ప‌ర్యాట‌క ప్రాంతాల్లో తిరిగే జంట‌ల‌కు పెళ్లిళ్లు చేస్తామ‌ని వీహెచ్‌పీ, భజరంగ్‌దల్  ముంద‌స్తుగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. గ‌త ఏడాది వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా కొన్ని జంట‌ల‌కు బ‌జ‌రంగ్ ద‌ళ్ స‌భ్యులు పెళ్లిళ్లు చేసే స‌మ‌యంలో ఘర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు భ‌ద్ర‌తా ఏర్పాటు చేశారు ప్రేమికులు భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని  తాము అండ‌గా ఉంటామ‌ని చెప్పారు దీంతో న‌గ‌రంలో్ కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్త‌కుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  

condomes
 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE