కువైట్ లో టీ కాంగ్రెస్ నేతల రాజకీయం!

Updated By VankayaWed, 02/14/2018 - 13:08
Congress party

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కువైట్ లో రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు ఇవాల్టి నుంచి 17 వరకు కువైట్ లో పర్యటించనున్నారు ప్రవాస భారతీయ కార్మికుల కోసం కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో అక్కడ తెలంగాణ కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నట్టు నేతలు చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా ఆధ్వర్యంలో ఎఐసిసి, ఐఎన్టీయూసి, టిపిసిసి-గల్ఫ్ ఎన్నారై విభాగం ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు.

కువైట్ ప్రభుత్వం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఇమిగ్రేషన్, నివాస చట్టాలను ఉల్లంఘించిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్ష లేకుండా తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశం కల్పించింది. అక్కడ.. దాదాపు 30 వేల మంది భారతీయ కార్మికులు ఉంటున్నట్లు అంచనా వేస్తున్నారు వీరిలో 5 వేల మంది తెలంగాణ కార్మికులున్నారని తెలుస్తోంది వారిని బుట్టలో పడేసేందుకే టీ కాంగ్ నేతలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే కువైట్ లో వలస కార్మికులను ఆదుకోవాలంటూ ప్రధాని మోడీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామన్నారు కాంగ్రెస్ నాయకులు తిరిగి వచ్చే కార్మికులకు పునరావాసం కల్పించాలన్నారు ఈ ప్రయత్నం నిజంగా నిస్వార్థంగా చేస్తున్నదే అయితే కాంగ్రెస్ నేతలను అభినందించాల్సిందే అంతే కానీ రాజకీయంగా పట్టు సాధించడం కోసమైతే మాత్రం కువైట్ లో అభాగ్యులుగా మారిన తెలంగాణ వారితో వారు రాజకీయ క్రీడ ఆడుతున్నట్టే లెక్క చూడాలి టీ కాంగ్ నేతల ఆరాటం వెనక అసలు లక్ష్యమేంటో!

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE