పెద్దాయన ఆస్తులు అమ్మేస్తున్నారా ?

Updated By VankayaWed, 05/16/2018 - 16:20
Dasarai narayana rao assets are ready to sold ?

టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా భావించే దాసరి నారాయణ రావు గారు చనిపోయి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. మే 30న మొదటి వర్ధంతి వస్తుంది. 150 సినిమాలకు దర్శకుడిగా వందల సినిమాలకు రచయితగా నటుడిగా ఎనలేని సేవలు అందించిన దాసరి గారి ఆస్తులు అమ్మకానికి వచ్చాయనే వార్త ఆయన అబిమానులను కలవరపెడుతున్నాయి. దాసరి గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు.

ఒక అబ్బాయి హరి హర ప్రభు అమెరికాలో స్థిరపడగా మరొక అబ్బాయి అరుణ్ కుమార్ ఇటీవలే ఒక్క క్షణం సినిమా ద్వారా విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు కాని అది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. సైరాలో కూడా ఒక చిన్న వేషం వేస్తున్నట్టు తెలిసింది. ఇలా వర్క్ అవుట్ కావడం లేదు కనక స్వంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారట అరుణ్. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్లస్ సోదరి హేమాలయ కుమారి కలిసి దాసరి గారి ఆస్తులను సమానంగా పంచుకుని వాటిని అమ్మే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

దాసరి నారాయణరావు గారి తో పాటు ఆయన భార్య పద్మ గారి సమాధులు ఉన్న మొయినాబాద్ లోని ఫార్మ్ హౌస్ లో కొంత స్థలం తప్ప మిగిలినదంతా అమ్మే ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. వాటితో పాటు కొన్ని ఇళ్ళు, పొలాలు అమ్మే ఒప్పందం కోసం కొన్ని లావాదేవీలు కూడా జరిపినట్టు ఫిలిం నగర్ టాక్. దాసరి గారి ఇంటిని సైతం పడగొట్టి కమర్షియల్ గా మార్చే ప్లాన్ అమలవుతోందని తెలిసింది. ఇది శిష్యులకు బాధ కలిగించేదే అయినప్పటికీ తమ మధ్య విభేదాలు రాకుండా ఉండటం కోసం ముగ్గురు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

అయినా ఏడాది కూడా పూర్తి కాకుండా పంపకాలు జరిగిపోయాయా అని అభిమానులు కలత చెందినా దాసరి గారే తీసిన బంగారు కుటుంబం, అమ్మ రాజీనామా సినిమాల తరహాలో బంధాలు మరీ సున్నితం అయిపోయాయి. అంగీకరించక తప్పదు. మహానటి స్ఫూర్తితో పెద్దాయన బయోపిక్ వస్తే బాగుంటుంది అని అభిమానుల కోరిక. మరి ఎవరైనా నడుం బిగిస్తే బాగుంటుంది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE