ఆ రచయితను తొక్కేసారా

Updated By VankayaMon, 02/12/2018 - 14:59
Writer

అతనో అప్ కమింగ్ రైటర్. కామెడీ సినిమాలతో పేరు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా రాయగలను అనే నమ్మకంతో అడుగులు వేస్తున్నాడు. ఒక సీనియర్ స్టార్ హీరోకి తన కం బ్యాక్ మూవీ కోసం ఇతను చెప్పిన స్టొరీ బాగా నచ్చింది. డ్యూయల్ రోల్, అందులోనూ హీరో తనే విలన్ తనే. ఇంకేముంది బ్రహ్మాండంగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పి తన స్వంత బ్యానర్లోనే తీసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇంతలోనే చిన్న అనుమానం. కథ ఎంత బాగా చెప్పినా ఇంకా కుర్ర వయసులోనే ఉన్నాడు. అనుభవం సరిపోదు. ఏదైనా తేడా వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ అడపదడపా సినిమాలు చేస్తున్న సీనియర్ మోస్ట్ రైటర్ ని పిలిపించారు. అక్కడితో అయిపోలేదు.

రిటైర్ అయిపోయి ఏడాదికో హారర్ సినిమా తీస్తూ కాలం గడుపుతున్న మరో అగ్ర దర్శకుడిని కూడా సహాయానికి రమ్మన్నారు. కొత్తగా వచ్చిన ఇద్దరు కలిసి ఈ కథ విన్నారు. అబ్బే ఇది ఇలాగే తీస్తే ఫ్లాప్ అవుతుంది అని చెప్పి తమను తోచినట్టు మార్పులు చేర్పులు చేసి ఇంటర్వెల్ కు రావాల్సిన విలన్ పాత్రను చివరి గంట ముందు మాత్రమే వచ్చేలా రీ డిజైన్ చేసి ఆ మేరకు స్క్రిప్ట్ లో మార్పులు చేయమని రచయితకు ఆర్డర్ వేసారు. హీరో రికమండేషన్, అందులోనూ ఆర్డర్ వేసింది సీనియర్ రైటర్ ప్లస్ టాప్ డైరెక్టర్. ఇష్టం లేకపోయినా అలాగే మార్చి రాసాడు ఈ రచయిత.

సినిమా విడుదల అయ్యింది. రివ్యూస్ మొదలుకొని ప్రేక్షకుల వరకు ఒకటే అభిప్రాయం. సినిమాని విలన్ పాత్ర మీదే  ప్రమోట్ చేసి వెండితెరపై మాత్రం కేవలం చివరి గంట మాత్రమే ఎందుకు చూపించారు అని అసంతృప్తి వ్యక్తం చేసారు. రెండో పాత్రను ఇంటర్వెల్ అయ్యాక కూడా సాగదీసి ఉన్నట్టుండి అసలైన రెండో పాత్రను చివరి గంటలో మాత్రమే చూపించడం ఇప్పుడు ఫలితాన్ని మార్చేస్తోంది.

పోటీ మధ్య విడుదల కావడంతో పాటు ఈ టాక్ కలెక్షన్ల పై ప్రభావం చూపిస్తోంది. పవర్ఫుల్ ఇంటర్వెల్ బ్లాక్ లో రెండు పాత్రలు ఒకేసారి కలుసుకునే తరహాలో తాను డిజైన్ చేస్తే తమ తెలివితేటలు ప్రదర్శించి ఇద్దరు అసలుకే మోసం తెచ్చారని సదరు రచయిత వాపోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. స్వేచ్చ ఇవ్వకుండా ఫాంలో లేని సీనియర్లను తీసుకొస్తే ఫలితం ఇలాగే ఉంటుంది మరి.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE