నిత్య మీనన్ దర్శకుడి ఆత్మహత్యాయత్నం

Updated By VankayaThu, 05/17/2018 - 14:34
 Rajasimha

రెండేళ్ళ క్రితం నిత్య మీనన్ హీరొయిన్ గా సందీప్ కిషన్ హీరోగా ఒక ఫ్లై ఓవర్ మీద జరిగే కథతో రూపొందిన ఒక్క అమ్మయి తప్ప సినిమా గుర్తుందా. దాని దర్శకుడు రాజసింహ తాడినాడ ఇవాళ ముంబైలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్టుగా వచ్చిన వార్త కలకలం రేపుతోంది. కెరీర్ పరంగా ఎదురుకుంటున్న సమస్యలతో పాటు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా అతను ఇలా చేసినట్టు ఇందులో ఉంది.

నిద్ర మాత్రలు అధిక మోతాదులో మింగేసిన రాజసింహను అపస్మారక స్థితిలో బాత్ రూమ్ లో పడిఉండగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి చేర్పించినట్టు అందులో పేర్కొనడం వైరల్ అవుతోంది. పరుచూరి బ్రదర్స్ వద్ద చాలా కాలం కామెడీ ట్రాక్స్ కు ఘోస్ట్ రైటర్ గా పని చేసిన రాజసింహ బొమ్మరిల్లు రచనలో కీలక భాగం వహించాడు. రాజసింహ ఒక పొలిటికల్ పార్టీకి సహాయకుడిగా కూడా పని చేసినట్టు అతని ఫేస్ బుక్ లో గతంలో చేసిన పోస్టింగ్స్ ని బట్టి ఉంది.

రాజసింహ గతంలో గుణశేఖర్ వంటి దర్శకుల వద్ద పని చేసాడు. రుద్రమదేవిలో అల్లు అర్జున్ వేసిన గోనగన్నారెడ్డి పాత్రకు సంభాషణలు రాసింది ఈయనే. పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ దర్శకుడిగా చేసిన ఒక్క సినిమా డిజాస్టర్ కావడంతో అవకాశాలు తగ్గడం మొదలుపెట్టినట్టుగా సన్నిహితుల సమాచారం.

ముంబైలో ఒక ఫ్యామిలీ వేడుక కోసం వచ్చిన రాజసింహ కుటుంబ సభ్యులను ఈ విషయమై సంప్రదించగా అలాంటిది ఏమి లేదని,ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఈ పుకారు ఎలా వచ్చిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం విశేషం. మరి స్పృహలో లేనట్టుగా ఆయన పడి ఉన్న ఫోటో గతంలోదా లేక విషయాన్ని దాస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే రాజసింహ స్వయంగా ఏదైనా చెబితే తప్ప ఇది నిజమా అబద్దమా నిర్ధారించలేం.

In English : 

Young director attempts suicide

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE