యాపిల్ క్రెడిట్ కార్డు ఆఫ‌ర్లు ఏంటో తెలుసా

Updated By VankayaWed, 05/16/2018 - 12:46
Do you know Apple credit card offers

 అమెరికా టెక్నాలజీ దిగ్గజం, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం యాపిల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. భార‌త్ లో ఆదాయాల్ని పెంచుకునేందుకు యాపిల్ సంస్థ ర‌క‌ర‌కాల ప్ర‌యత్నాలు చేసింది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్ పై దృష్టిసారించిన యాపిల్ సంస్థ ఆ దిశ‌గా అడుగులు వేస్తుంది. 

ఇప్ప‌టికే స్మార్ట్ ఫోన్ , ల్యాప్‌టాప్ల‌తో హ‌వాకొన‌సాగిస్తున్న యాపిల్ సంస్థ త్వ‌ర‌లో యాపిల్ క్రెడిట్ కార్డుల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇత‌ర క్రెడిట్ కార్డుల కంపెనీల‌కు చెక్ పెట్టేందుకు యాపిల్ భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వాల్ స్ట్రీట్ క‌థ‌నాలు చెబుతున్నాయి. 

ఇప్ప‌టికే యాపిల్ క్రెడిట్ కార్డుల‌ను విక్ర‌యించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దిగ్గ‌జ కంపెనీ జియో త‌ర‌హాలో క్రెడిట్ ఇండ‌స్ట్రీని శాసించేలా నిర్ణ‌యాలు తీసుకోనుంది. 

అమెరికాకు చెందిన క్రెడిట్ కార్డుల విక్ర‌య సంస్థ‌లు వీసా - మాస్టర్ కార్డు. ఇప్పుడు ఈ రెండింటికి పోటీగా యాపిల్ సొంతంగా క్రెడిట్ కార్డుల‌ను త‌యారు చేయనుంది. అంతేకాదు ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు గోల్డ్ మెన్ సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది.

పనిలో ప‌నిగా ఇత‌ర క్రెడిట్ ఆఫ‌ర్లు ఎలా ఉన్నాయి. వాటి ఆధారంగా ఇత‌ర క్రెడిట్ కార్డుల‌కంటే యాపిల్ క్రెడిట్ కార్డుకు ఎక్కువ ఆఫ‌ర్లు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.  ఈ యాపిల్ క్రెడిట్ కార్డు ద్వారా యాపిల్ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వీటికి ఎలాంటి వడ్డీ లేని రుణం ఇవ్వడంతో పాటు మరింత డిస్కౌంట్ ఇచ్చేలాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యాపిల్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

సాఫ్ట్ వేర్ నిపుణులు, విద్యార్ధులను టార్గెట్ చేస్తూ  కంప్యూటర్లు, లాప్ ట్యాప్ లు, వాచీలు, ఐ ఫోన్లు , ఇలా యాపిల్ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేయేసేటప్పుడు యాపిల్ క్రెడిట్ కార్డు మీకు వడ్డీ లేని రుణం మరియు డిస్కౌంట్ లభిస్తాయ‌ని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE