ప్రియదర్శి రియల్ లవర్ ఎవరో తెలుసా

Updated By VankayaWed, 02/14/2018 - 17:39
Do you know priyadarsini real lover !

తెలంగాణా స్లాంగ్ తో పెళ్లి చూపులు సినిమాలో అందరిని తన టైమింగ్ తో కట్టి పడేసిన కమెడియన్ ప్రియదర్శి ఇవాళ వాలెంటైన్ డే సందర్భంగా తనలో నిజమైన ప్రేమికుడిని ప్రపంచానికి పరిచయం చేసాడు. ఎవరో అమ్మాయితో ఘాడమైన ప్రేమలో మునిగి తేలుతున్నాడు అనే టాక్ ముందు నుంచి ఉన్నప్పటికి ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అనే క్లారిటీ మాత్రం ఎవరికి లేదు.

అందుకే ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రియురాలిని తనే పరిచయం చేసాడు ప్రియదర్శి. ఒక గ్రీటింగ్ కార్డు మీద తాను స్వయంగా రాసుకున్న మ్యాటర్ తో రిచాను ఉద్దేశించి హృదయాన్ని హత్తుకునేలా ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయటం ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో ఏం రాసాడో చూద్దాం.

ప్రియా, నా మనసులో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ నీకు పదాలు, వాక్యాల రూపంలో చెప్పాలని కూర్చున్నా. కాని కుదరలేదు. ఫెయిల్ అయ్యా. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే నాకు తెలుసు నీ అందమైన హృదయం, ఆత్మ గురించి చెప్పాలంటే మిలియన్ల కొద్ది పదాలు కావాలి. అది నేను ప్రతి రోజు, ప్రతి క్షణం జీవితాంతం చేస్తూనే ఉంటాను. నిన్ను నా జీవితంలోకి పంపినందుకు విధికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నువ్వు నా భావాలకు సరితూగే భాగస్వామివి. రా, మన స్నేహాన్ని సంబరంగా మార్చుకుని ప్రేమను నిర్వచిద్దాం.హ్యాపీ బర్త్ డే రిచా, నా ప్రియమైన వాలెంటైన్ , ఆ చందమామ ఈ భూమి ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.

ఇదండీ ప్రియదర్శి ఇంగ్లీష్ లో చెప్పిన అందమైన భావాలకు తెలుగు రూపం . ఎంత చక్కగా చెప్పాడో కదా. బాగా టచ్ చేసేలా ఉన్న ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పైకి సరదాగా నవ్విస్తూ తిరిగే ప్రియదర్శిలో ఇంత గొప్ప ప్రేమికుడు ఉన్నాడా అని అతని స్నేహితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అదేమరి ప్రేమ మహత్యం. ఒక్కసారి తన వైపుకు లాక్కుందా బయటికి రావడం అసాధ్యం.

Do you know priyadarsini real lover !

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE