ప్రియా వారియర్ ప్రియమైన ముచ్చట్లు

Updated By VankayaTue, 02/13/2018 - 13:13
Facts about Priya's wink takes internet by storm

సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒకటే చర్చ. అందరి పోస్టుల్లో ఒకటే ఫోటో. అసలు ఎలా మొదలైందో తెలియదు, ఎవరు ఫస్ట్ పోస్ట్ చేసారో గుర్తు లేదు, సునామి లాగా అందరి మొబైల్ ఫోన్స్ వాల్ పేపర్స్ ఆక్రమించుకున్న లేటెస్ట్ కేరళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. గత మూడు రోజులుగా తన నామ స్మరణతో యూత్ ఫేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంటులు మోతెక్కిపోతున్నాయి.

ఒరు ఆదార్ లవ్ అనే మలయాళం సినిమాలోని సాంగ్ ని వీడియో రూపంలో విడుదల చేసిన ఆ సినిమా యూనిట్ ఇంత భీభత్సమైన రెస్పాన్స్ చూసి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బిజినెస్ ఆఫర్స్ అమాంతం పది రెట్లు రెట్టింపు స్థాయికి ఎగబాకడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. అసలు ఈ ప్రియా ప్రకాష్ వారియర్ ఎవరు అనే దాని గురించి కూడా హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ప్రియా వారియర్ వయసు జస్ట్ 18 ఏళ్ళు మాత్రమే. ఒమర్ లులు దర్శకత్వం వహిస్తున్న ఒరు ఆదార్ లవ్ తనకు మొదటి సినిమా. మార్చ్ 3న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేమమ్ తర్వాత అంత క్రేజ్ ఉన్న మూవీగా కేరళలో బజ్ తెచ్చేసుకుంది. త్రిసూర్ లోని విమలా కాలేజీ లో బికాం ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రియా వారియర్ ఒక్క రోజులోనే సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం తన ఇంటి నుంచి స్వేచ్చగా బయట తిరగలేని పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం తన ఇన్స్ టాగ్రామ్ లో ఒక మిలియన్ పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

మలిక్య మలరాయా పూవి అంటూ సాగే ఈ పాటలో ప్రియా వారియర్ కనుబొమ్మలు పైకెత్తి అటు ఇటు తిప్పుతూ తన బాయ్ ఫ్రెండ్ ని కవ్వించే సీన్ కి యూత్ మతులు పోగొట్టుకుంటున్నారు. ఎక్స్ ప్రేషన్స్ తోనే అందరిని పడగొట్టిన ప్రియా వారియర్ పాటల్లో కనిపించినంత గొప్ప గ్లామర్ గా ఉండదు. మంచి కళ కలిగిన మొహం ఉన్న ప్రియా వారియర్ ని దర్శకుడు అద్భుతంగా చూపించడమే ఇన్ని సంచలనాలకు కారణం అయ్యింది.  

In English : 

That expression girl, Priya, sent out of house!

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE