శ్రీవారికంటే ముందుగా ద‌ర్శించుకోవాల్సింది వ‌ర‌హాస్వామినే

Updated By VankayaMon, 04/16/2018 - 14:06
Famous temple in South India

 ద‌క్షిణ భార‌త దేశంలో అతిపెద్ద పుణ్య క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి. భ‌క్తుల కోరిక‌లు తీర్చే కొంగుబంగారంగా కొలువై ఉన్న ఈ పుణ్య క్షేత్రానికి విశిష్ట‌మైన ప్ర‌త్యేకత‌ ఉంది. అందుకే దేశ విదేశాల నుంచి వ‌చ్చే భ‌క్తులు సైతం తిరుమ‌ల‌ స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు బారులు తీరుతుంటారు. అయితే ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఎక్క‌డ దేవాల‌యం ఎక్క‌డ ఉంది. కుల‌మాతాల‌కు అతీతంగా పూజ‌లు చేసే ఈ పుణ్య‌క్షేత్రంలో ద‌ర్శించుకోవాల్సిన ప్ర‌దేశాలేంటో చూద్దాం. 

ద‌క్షిణ భార‌త దేశం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పుణ్య‌క్షేత్రం అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది తిరుమ‌ల తిరుప‌తి. ఈ తిరుమ‌ల తిరుప‌తి క్షేత్రానికి ప్ర‌త్యేక ఉంది.  ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న ప‌ట్ట‌ణం తిరుప‌తి. ఆ ప‌ట్ట‌ణాన్ని ఆనుకొని ఉన్న కొండ‌లపై ఉన్న ఊరు తిరుమ‌ల‌. ఆ ఊరిలోనే వెంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువై ఉన్నారు. కాబ‌ట్టే ఆ పుణ్య‌క్షేత్రాన్ని తిరుమ‌ల తిరుప‌తి అని సంభోదిస్తుంటారు. శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతుంటుంది. ప్ర‌తిదినం ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకుంటార‌ని అంచ‌నా. శ్రీవారితో పాటు ద‌ర్శించుకోవాల్సిన మ‌రికొన్ని పుణ్య‌స్థ‌లాలు ఉన్నాయి. వాటిలో  పుష్క‌రిణి , శ్రీ వ‌ర‌హా స్వామి, వ‌ర‌ద రాజ స్వామి ఆల‌యం , వకుళ‌మాత ఆల‌యం ఇలా సుప్ర‌సిద్ధ పుణ్య‌స్థ‌లాలు అనేకం ఉన్నాయి. 

అయితే తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కంటే ముందుగా శ్రీవ‌ర‌హా స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలి. ఆ త‌రువాత‌నే వెంక‌న్న ద‌ర్శ‌నానికి వెళ్లాలి. ఎందుకంటే తిరుమ‌ల‌లో వెంక‌టేశ్వ‌ర స్వామి ఉండేందుకు అనుమ‌తి ఇచ్చింది ఈ శ్రీ వ‌ర‌హా స్వామే అని చ‌రిత్ర గాథ‌లు చెబుతున్నాయి. 

హిందూ పురాణాల ప్ర‌కారం లోక పాల‌కుడు విష్ణువు లోక‌పాల‌కుడు. ఆయ‌న‌ మూడు అవ‌తారాల‌లో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. అందులో శ్రీవ‌రాహా మూర్తి , వ‌రాహావ‌తార‌ము, వ‌ర‌హ‌స్వామి ఈ మూడు అవ‌తారాలు విష్ణువును వ‌ర్ణించే నామాలు . 

ఇక తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికంటే ముందు వ‌ర‌హస్వామిని ద‌ర్శించుకోవాల‌ని స్థ‌ల పురాణం చెబుతున్న క‌థ‌నం ప్ర‌కారం  మహా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు వేయి ఏళ్లు త‌ప‌స్సు చేసి బ్ర‌హ్మ‌నుండి వ‌రాలు పొందుతాడు. దీంతో హిర‌ణ్యాక్షుడికి  అహంకారం పెరిగిపోతుంది.  హిరణ్యాక్షుడు వస్తున్నాడంటే గరుత్మంతున్ని చూసిన పాముల్లా దేవత‌లు దాక్కునేవార‌ని నానుడి.అలాంటి హిర‌ణ్యాక్షుడు  హేళ‌న చేస్తూ భూమాత‌ను స‌ముద్రంలో క‌లిపేస్తాడు.

హిర‌ణ్యాక్షుడి తీరును చూసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ని లోక‌పాల‌కుడు విష్ణుమూర్తి వ‌రహావ‌తారం ఎత్తుతాడు. స‌ముద్రంలో మునిగిపోతున్న భూమ‌త‌ను త‌న మూతిపై పెట్టుకొని ఒడ్డుకు చేరుస్తాడు. అంత‌టి చ‌రిత్ర క‌లిగిన వ‌ర‌హాస్వామి శ్రీనివాసుడు తిరుమ‌ల‌లో కొలువుదీరేందుకు భూలోకంలో స్థ‌లాన్ని ప్రసాదిస్తాడు. అందుకే కాబోలు  తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కంటే ముందుగా వ‌ర‌హాస్వామిని ద‌ర్శించుకోవాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE