ఎంత ప‌నిచేశావు గురుల‌క్ష్మి

Updated By VankayaMon, 05/14/2018 - 19:56
Gurulaxmi suicide for exam fail

నేటిత‌రం యువ‌త ఆత్మ‌నూన్య‌త‌కు లోనై ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. నిత్యం త‌ల్లిదండ్రులు కొట్టార‌నో, త‌ల్లిదండ్రులు తిట్టార‌నో పిల్ల‌లు సూసైడ్ చేసుకునే సంఘ‌ట‌నలు జ‌రుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ విద్యార్ధిని తాను ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయినా త‌ల్లిదండ్రులు తిట్ట‌లేద‌ని మ‌న‌స్థాపానికి గురైన విద్యార్ధిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. 

ప్రకాశం జిల్లా తురకపాలెంలో సూరా వెంకటరెడ్డి కుమార్తె గురులక్ష్మి (20) గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్‌ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే తాజాగా ఇంజినీరింగ్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఆ ఫ‌లితాల్లో గురు ల‌క్ష్మీ ఇప్ప‌టి వ‌ర‌కు 9 స‌బ్జెట్ల‌లో ఫెయిల్ అయ్యింది. 

అయినా గురుల‌క్ష్మి త‌ల్లిదండ్రులు ఆమెను ప‌ల్లెత్తు మాట ఆన‌లేదు. దీంతో తీవ్ర‌మ‌న‌స్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.అంతేకాదు తాను ఫెయిల్ అయినా త‌ల్లిదండ్రులు ఒక్క‌మాట కూడా అన‌లేదంటూ ఆత్మ‌హ‌త్య‌కు సూసైడ్ లేఖ రాసింది. ఆ లేఖ‌లో ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వ‌ని. మా అమ్మానాన్న ఏమ‌న్నారు. అన్నీతెలిసి కూడా తాగాను. నాన్న నేను చ‌నిపోతున్నాఅంటూ రాసింది.

అయితే  సూసైడ్ నోట్ చూసి విషయం గమనించిన తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఈ విద్యార్థిని మృతి చెందింది.  స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE