ఇదేం చోద్యం.. కాంగ్రెస్, చంద్రబాబు భాయీ భాయీ!

Updated By VankayaThu, 05/17/2018 - 15:29
Congress Party

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పునాదుల మీద. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఏపీని ఏలుతున్న సమయంలో ఎన్టీఆర్ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని ఏర్పరిచాడు. తొమ్మిది నెలల్లో అధికారాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిగానే ఆయన కొనసాగాడు. తెలుగుదేశం పార్టీ ఉనికి ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మీదే. కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ వచ్చారు ఏపీ ప్రజలు. అదీ తెలుగుదేశం పార్టీ ప్రస్థానం.

అయితే అవకాశవాదుల్లో నంబర్ వన్ అయిన చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీతో అడపాదడపా చేతులు కలుపుతూనే ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలకుండా ఉండాటానికి చంద్రబాబు సహకరించాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు దాన్ని అడ్డుకున్నాడు.

అవిశ్వాస తీర్మానానికి సైతం మద్దతు ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు పలకపోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే చంద్రబాబుకు అప్పట్లో కాంగ్రెస్ తో దోస్తీ ఉండింది దీంతో అలాగే కొనసాగాడు. ఇక మళ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ని వ్యతిరేకిస్తున్నాను అంటూ బీజేపీతో చేతులు కలిపాడు.

ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేకిగా మారిపోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతుండటం విశేషం. కర్ణాటక రాజకీయ పరిణామాలపై చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సలహాదారుగా మారిపోయాడు. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలో సలహాలిస్తున్నాడట చంద్రబాబు నాయుడు. మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతే ఊపిరిగా మొదలైన పార్టీ ఇలా కాంగ్రెస్ తో అంటకాగుతుండటం విశేషం. దీంతోనే తెలుగుదేశం పార్టీ పతనావస్థ మొదలైందని చెప్పవచ్చు.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE