పోకిరి పోరి తల్లి కాబోతోందా

Updated By VankayaTue, 04/17/2018 - 11:04
Ileana D'Cruz

ఏమో మరి బాలీవుడ్ కథనాలు ఇదే నొక్కి చెబుతున్నాయి. టాలీవుడ్ లో తన జర్నీ మొదలుపెట్టి ఇక్కడ అగ్ర హీరోలందరి సరసన అవకాశాలు కొట్టేసి స్టార్ హీరొయిన్ గా వెలుగు వెలిగిన ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళాక ఇక్కడ పెద్దగా కనిపించలేదు. బాయ్ ఫ్రెండ్ అండ్రూ నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే అయినప్పటికీ దాన్ని బయటికి చెప్పుకోవడానికి మాత్రం ఇలియానా ఎప్పుడు ఇష్టపడలేదు.

అజయ్ దేవగన్ తో నటించిన రైడ్ సినిమా ప్రమోషన్ లో ఇదే విషయాన్నీ గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే స్మార్ట్ గా తప్పుకున్న ఇల్లి లవర్ తో సహగమనం చేస్తోంది మాత్రం నిజం. తన బాయ్ ఫ్రెండ్ తో చనువుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఇలియానా ఓ సందర్భంలో దేవుడిచ్చిన బెస్ట్ బెటర్ హాఫ్ ఆండ్రూ అని చెప్పుకుంది కూడా.

విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని టాక్. ఇది నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి ఇలియానా అందుబాటులో లేదు కనక ఇప్పుడే దీని గురించి ఖరారుగా చెప్పలేం. కాని సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేదు కనక ఇది నిజమే అంటున్న వారు లేకపోలేదు. సౌత్ సినిమా గురించి ఇక్కడ దర్శకుల మేకింగ్ గురించి తాప్సీ తరహాలో ఆ మధ్య కొన్ని నెగటివ్ కామెంట్స్ చేసిన ఇలియానా మళ్ళి ఎక్కడా కనిపించలేదు. రైడ్ సక్సెస్ అయినా అందులో తన పాత్ర మరీ అంత చెప్పుకోదగ్గది కాకపోవడంతో ఇలియానా లైట్ తీసుకుంది. మరి ఇలియానా తల్లి కావడం గురించి వస్తున్న వార్త నిజమే అయితే మరో బుల్లి ఇల్లి ప్రపంచంలోకి అడుగు పెట్టనుంది.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE