ఆ నిర్మాత సినిమాలు తీసేదే అమ్మాయిల కోసం

Updated By VankayaSat, 04/14/2018 - 10:37
gossiphs

శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ మంటలు ఈ చీకటి కోణంలో కొత్త కొత్త నిజాలు బయటికి తెస్తున్నాయి. నిజంగా వేధింపులు ఉన్నాయా అంటే లేవు అని చెప్పే ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారు అంటే దానికి కారణం కంటి ముందు కనిపిస్తున్న నిజాలు. ఇది ఫ్లాష్ బ్యాక్ స్టొరీ.

ఆయనో బడా నిర్మాత. పదిహేనేళ్ళ క్రితం పరిశ్రమకు వచ్చాడు. బ్యానర్ కూడా బాగా పేరు తెచ్చుకుంది. వ్యాపార రంగంలో ఉంటున్న ఆయనకు రాజకీయంగా ఎదగాలని కోరిక. కాని ఎంత డబ్బు వెదజెల్లినా అది జరిగే పనిలా కనిపించలేదు. కారణం ఎవరైతే తనకు రాజకీయంగా ఎదుగుదల కోసం సహాయ పడాలో వాళ్ళకే తరాలు తిన్నా తరగనంత ఆస్తి ఉంది. తనకు బాగా చనువు ఉన్న ఒక పొలిటికల్ ఫ్రెండ్ ద్వారా ఏం చేయాలి అని అడిగాడు. దానికి అతను చెప్పిన సమాధానం.

“రాజకీయంగా ఎదగాలి అంటే ఎర వేయటం చాలా అవసరం. కాని ఇక్కడ డబ్బు ఎరగా వేస్తే ఎవరు లొంగరు. లంచాలు, స్కాములు, ముడుపులు ఇలా దొంగ దారుల్లో వందల వేల కోట్లు వాళ్ళ దగ్గరే మూలుగుతున్నాయి. వాళ్ళకు కావలసింది అమ్మాయిలు. కామ వాంఛ తీర్చే సినిమా హీరొయిన్లు. వాళ్ళను నువ్వు పంపగలిగే స్థాయిలో నువ్వుంటే ఈ కాంతదాసులంతా నువ్ ఆడినట్టు ఆడతారు. అలా చేయాలంటే నువ్వ సినిమాల్లోకి వెళ్లి వీళ్ళకు ఎరగా వేయలనుకున్న కోట్ల రూపాయల డబ్బుతో సినిమాలు తీయి. అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను సినిమాల్లో చాన్సులిస్తూనే నీ ప్రయోజనాల కోసం ఒళ్ళు తాకట్టు పెట్టాలని చెప్పు. అందుకు ఒప్పుకున్నవాళ్ళకే డబ్బుతో పాటు భవిష్యత్తు ఇస్తానని చెప్పు. అంతే”

కట్ చేస్తే అతని సలహా పాటించిన సదరు నిర్మాత ఆ ఉద్దేశంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టి అనూహ్యంగా అగ్ర నిర్మాతగా మారాడు.రాజకీయంగా తన పనులు చక్కదిద్దుకోవడంతో పాటు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంతో పాటు మాట విన్న హీరొయిన్లను బెడ్ షేరింగ్ కి పంపించి పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. ఇలాంటి కథలెన్నో ఇప్పుడు బయటికి వస్తున్నాయి. నిన్న ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో కొందరు అమ్మాయిలు దీని గురించి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేయటం చూస్తే ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయన్న అనుమానం నిజమే అనిపిస్తుంది.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE