
అటు తిరిగి ఇటు తిరిగి గొడవను పవన్ కల్యాణ్ దిశగా పంపిస్తున్నారు. ఎక్కడో మొదలుపెట్టిన వ్యవహారం ఇప్పుడు పవన్ కల్యాణ్ కు మిడిల్ ఫింగర్ చూపించడం ఆసక్తిదాయకంగా మారింది. అలాగే పవన్ కల్యాణ్ తల్లిని శ్రీ రెడ్డి నిందించిన తీరు కూడా సంచలనంగా మారింది. శ్రీ రెడ్డి విషయంలో పవన్ కల్యాణ్ సాఫ్ట్ గా స్పందించాడు. ఆమె తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు అని పవన్ వ్యాఖ్యానించగా, ఏపీకి జరిగిన అన్యాయంపై కూడా పవన్ పోరాడనక్కర్లేదని, కంప్లైంట్ ఇస్తే పోయేదని శ్రీ రెడ్డి ఎద్దేవా చేసింది.
ఈ క్రమంలో అనంతరం కూడా పవన్ పై ఆమె ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే శ్రీ రెడ్డిని పవన్ వైపు ఉసిగొల్పుతున్నది ఒక రాజకీయ పార్టీ అనే ప్రచారం కూడా వస్తుండటం విశేషం. శ్రీ రెడ్డిని పవన్ మీదకు ఒక రాజకీయ పార్టీ రెచ్చగొట్టి పంపిందనే ప్రచారం సాగుతోందిప్పుడు. కొన్నాళ్ల నుంచి పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకున్న పార్టీ మరేదో కాదు.. తెలుగుదేశమే అని వేరే చెప్పక్కర్లేదు. పవన్ కల్యాణ్ ను అన్ని రకాలుగానూ టార్గెట్ గా చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ. పవన్ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటి నుంచి ఆయనపై అనేక రకాల ముద్రలేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని ఆ మధ్య స్వయంగా చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. అక్కడ నుంచి పవన్ పై అనేక రకాలుగా టీడీపీ దాడులు చేస్తోంది. పవన్ కల్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయని, పవన్ కల్యాణ్ కు స్థిమితం లేదని, స్థిరత్వం లేదని.. ఇలా టీడీపీ నేతలు అనేక రకాలుగా ధ్వజమెత్తారు. తమకు సపోర్ట్ చేసినంత సేపూ పవన్ విషయంలో టీడీపీకి ఈ తప్పులు కనిపించలేదు. ఎప్పుడైతే తమను వ్యతిరేకించాడో అక్కడ నుంచి టీడీపీ రచ్చ మొదలైంది.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పైకి శ్రీ రెడ్డిని ఉసిగొల్పడంలో టీడీపీ బిజీగా ఉందనే మాట వినిపిస్తోంది. పవన్ కు మసాజ్ ల పిచ్చి అని, పవన్ బెంగాళీ అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటాడని.. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో ప్రచారం చేయించడంలో కూడా టీడీపీ బిజీగా ఉందని టాక్.