కర్ణాటక గద్దెపై యడ్డీ.. పదవి అలా నిలబెట్టుకుంటాడా?

Updated By VankayaThu, 05/17/2018 - 11:47
Yadyurappa

మొత్తానికి కర్ణాటక గద్దెపై బీజేపీ ముఖ్యమంత్రి ఎక్కాడు. ఐదేళ్ల విరామం అనంతరం ఒక బీజేపీ సీఎం కర్ణాటక సింహాసనాన్ని అధిష్టించాడు. ఐదేళ్ల కిందట చేజారిన అధికారం బీజేపీకి ఇప్పుడు ఇలా దక్కింది. యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఇప్పుడు కావడం పెద్ద కథ కాదు, దీన్ని నిలబెట్టుకోవడమే అసలు కథ అని చెప్పకతప్పదు. ఎంత కాదనుకున్నా కర్ణాటక గవర్నర్‌గా ఉన్నది భారతీయ జనతా పార్టీ వ్యక్తి. ఈ పార్టీ మాజీ నేత. దీంతో ఆయన ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని యడ్యూరప్పకు సీఎం అవకాశాన్ని ఇచ్చేశాడు. ప్రమాణస్వీకారం చేయించేశాడు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు యడ్యూరప్ప ఆ పదవిని నిలబెట్టుకోవాల్సి ఉంది. దీనికి బీజేపీ దగ్గర వ్యూహాలున్నాయని చెప్పక్కతప్పదు. ప్రస్తుతానికి అయితే పూర్తి మెజారిటీ లేదు. ప్రభుత్వం నిలబడటానికి మరో ఎనిమిది ఎమ్మెల్యేల అవసరం ఉంది బీజేపీకి. దీనికి గానూ కాంగ్రెస్, జేడీఎస్‌ల బుట్టల్లో బీజేపీ చేతులు పెట్టాల్సి ఉంది. అయితే అలా ఎమ్మెల్యేలను సంపాదించడం, వారి చేత మద్దతు పొంది  ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. అలాంటి సమయంలో కర్ణాటక విధానసౌధలో రచ్చ జరిగే అవకాశం ఉంది. పరస్పరం దాడులు చేసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ పరిణామాల నేఫథ్యంలో బీజేపీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత మద్దతు పలకడానికి కన్నా ముందు వారి చేత గౌర్హాజరీకి అవకాశం ఉంటుంది. బలనిరూపణ సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలను గైర్హాజరీ చేయించారంటే బీజేపీకి పని సులువు అవుతుంది. ఉన్న వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపే ఉంటారు కాబట్టి..ప్రభుత్వాన్ని అలా నిలబెట్టుకోవచ్చు.

ఇక ఆ తర్వాత కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి బీజేపీ వాళ్లు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. గతంలో ఇదే వ్యూహంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది బీజేపీ. ఇప్పుడూ అదే ఎత్తుగడ అనుసరించవచ్చు.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE