ప్రియురాలి శవానికి తాళిబొట్టు శుభ‌వేళ‌

Updated By VankayaTue, 02/13/2018 - 12:58
Heart touching Scene Man marries his dead lover

తమ అవసరాల కోసం, పాకెట్ మనీకోసం ప్రేమను ఓ అస్త్రంలా వాడుకొని వదిలేసే వారు వీరి ప్రేమ గురించి తెలుసుకుంటే కనువిప్పు కలుగక మానదు. చరిత్రలో కొన్ని వేల‌, ల‌క్ష‌ల ప్రేమ క‌థ‌లున్నాయి. వాటిని చ‌దివితే కన్నీళ్లు చెమ్మ‌గిల్లుతాయి.  అ  కోవకే చెందుతుంది  వీరిద్ద‌రి ప్రేమ‌క‌థ‌.

త‌మిళ‌నాడుకు చెందిన యువ‌తి, యువ‌కుడు గాఢంగా ప్రేమించుకున్నారు. చెట్టాప‌ట్టాలేసుకొని తిరిగారు. భ‌విష్య‌త్తు, పిల్ల‌లు , సంసారం అంటూ బోలెడు క‌బుర్లు చెప్పుకునేవారు.  కానీ ఓ రోజు వీరిద్ద‌రి త‌మ ప్రేమ‌విష‌యాన్ని ఇంట్లో పెద్ద‌ల‌కు చెప్పారు. తామిద్ద‌రం ప్రేమించుకుంటున్నామ‌ని, పెళ్లి చేయండ‌ని పెద్ద‌ల్ని కోరారు. అందుకు ఒప్పుకొని అమ్మాయి త‌ల్లిదండ్రులు ప్రేమ పెళ్లిని వ్య‌తిరేకించారు.

ప్రేమా లేదు దోమా లేదు. త్వ‌ర‌లోనే నీకు పెళ్లి చేస్తామ‌ని అమ్మాయిని బెదిరించారు. ఆ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ్డ ఆ యువ‌తి తాను ప్రేమించే వాడు దూరం అవుతున్నాడ‌ని తెలిసి త‌ట్టుకోలేక ఓ లేఖ రాసింది. ఎలాగూ తన ప్రియుడితో పెళ్లికాలేదు… చనిపోయిన తర్వాతైన అతడితో తాళి కట్టించాలని కోరింది. అనంత‌రం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. 

 దీంతో కూతురు మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని త‌ల్లిదండ్రులు త‌ప్పుచేశామ‌ని గుండెల‌విసేలా ఏడ్చారు. చలించిపోయిన అమ్మాయి కుటుంబసభ్యులు కూతురు కోరుకున్న‌ట్లు  ఆ కుర్రాడితో కూతురు శవానికి తాళి కట్టించారు

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE