హీరో జంట జాలీ-నిర్మాత పర్సు ఖాళీ

Updated By VankayaTue, 02/13/2018 - 13:48
Producer

సినిమా పరిశ్రమలో అంతే. హీరోలు ఎలా చెబితే నిర్మాతలు అలా తలూపాల్సిన పరిస్థితి వస్తుంది. మార్కెట్ ఇప్పుడు హీరోలను ఆధారంగా చేసుకునే నడుస్తోంది కాబట్టి తప్పక దీన్ని అనుసరిస్తున్న వారు ఎందరో. ఖర్చు ఏదైనా అది నిర్మాత ఖాతాలో వేసేయడం కొందరు హీరోలకున్న అలవాటు. ఇటీవలే ఒక పేరున్న యూత్ హీరో తన సినిమా కోసం బ్యాంకాక్ కు వెళ్ళాడు.

అందులో హీరొయిన్ తనకు బాగా క్లోజ్. మొదటి సినిమాతోనే సంచలనం రేపిన ఆ అమ్మడు తర్వాత అంత జోరు చూపలేకపోయింది కాని అప్పుడప్పుడు అవకాశాలు మాత్రం కొట్టేస్తోంది. ఈ ఇద్దరు బాగా చనువుగా ఉండటం ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత నిర్మాత యూనిట్ మొత్తానికి ఒక త్రీ స్టార్ హోటల్ లో వసతి బుక్ చేసాడు. అక్కడ తమ ప్రైవసీ దెబ్బ తింటోంది అని ఫీల్ అయిన హీరో హీరొయిన్ నిర్మాతకు డిమాండ్ చేసి మరీ సెవెన్ స్టార్ హోటల్ కి షిఫ్ట్ అయ్యారు.

కథ అక్కడితో అయిపోలేదు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయటమే కాకుండా షాపింగ్ కూడా మహా జోరుగా చేసారు. సదరు హీరొయిన్ వ్యక్తిగతంగా తాను ఒక్కర్తే హీరోతో పది లక్షల రూపాయల విలువైన షాపింగ్ చేయగా వివిధ రూపాల్లో మొత్తం ముప్పై లక్షల దాకా క్యాష్ కూడా తన ఎకౌంటు లో వేయించుకుంది. హీరో మారు మాట్లాడకుండా అన్ని నెరవేర్చి ఆ మొత్తం నలభై లక్షల బిల్లును నిర్మాత ఖాతాలో రాసేసరికి ఆయనకు గుండాగినంత పనైంది. అయినా చేసేది ఏమి లేక ఆ మొత్తం సమర్పించుకున్నట్టు టాక్.

హీరో హీరొయిన్ల వ్యక్తిగత సరదాలు కూడా ఇలా నిర్మాత ఎకౌంటు లో వేయటం ఏంటని సదరు నిర్మాత పరిశ్రమలో తన స్నేహితుల వద్ద వాపోయినట్టు టాక్. ఆ హీరో తో మరో సినిమా అగ్రిమెంట్ అయిన కారణంగా ఏమి అనలేక నిస్సహాయంగా ఆ మొత్తాన్ని భరించినట్టు చెప్పుకున్నాట్ట. ఇంతా చేసి ఆ హీరో హీరొయిన్ జంటకు పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం లేదు అనేది మరో ట్విస్ట్

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE