హీరోలు ఇలా కూడా ప్రవర్తిస్తారా

Updated By VankayaTue, 01/02/2018 - 18:58
hero-harrasment-heroin-tollywood

అతనో అప్ కమింగ్ యాక్టర్. కొన్ని సినిమాలు చేసాడు కాని అందులో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటే. షూటింగ్ పూర్తయ్యి మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బలమైన ఫ్యామిలీ సపోర్ట్ ఉండటంతో ఇతని అవకాశాలకు లోటు లేదు రాదు. కాని తాను మగాన్నే అని రుజువు చేసుకోవడానికి కాబోలు తన సినిమాలో నటించిన హీరొయిన్ ని వేధించడం మొదలు పెట్టాడు. తన కోరిక తీర్చమని వెంటపడటమే కాక ఓ రెండు సార్లు ఆమె రాజీ అయ్యేలా కూడా చేసాడట. 

సదరు హీరొయిన్ దర్శకుడితో చెప్పుకున్నా లాభం లేకపోయింది. అతను కూడా ఇప్పుడిప్పుడే పైకొస్తున్న వాడు. హెల్ప్ లెస్ అనేసాడు. దీంతో తనను వదలకుండా వెంటాడుతున్న హీరో బారి నుండి తప్పుకోవడానికి నెంబర్ కూడా మార్చేసింది. వీడియో కాల్స్ చేస్తుండటంతో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండటం మానేసింది. సినిమా యూనిట్ క్రియేట్ చేసిన వాట్స్ అప్ గ్రూప్ నుంచి కూడా బయటికి వచ్చేసింది.

 

ఇంతా జరుగుతున్నా ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. ఆ హీరొయిన్ ఎక్కువ సినిమాలు చేసిన పెద్ద రేంజ్ కాదు. ఇది హిట్ అయితేనే తనకు ఫ్యూచర్ బాగుంటుందని నమ్మి చేస్తోంది. తీరా హీరో ప్రవర్తన వల్ల తెలుగు సినిమాలే వద్దు అనే దాకా వెళ్లిందట. ప్రమోషన్ కు రమ్మంటే రాను అని చెప్పిన ఆ హీరొయిన్ చివరికి దర్శకుడి విన్నపం మేరకు మొక్కుబడిగా వచ్చి వెళ్తోందని టాక్. 

దాసరి గాలిమేడలు, కృష్ణవంశి ఖడ్గం లాంటి సినిమాల్లో ఇలాంటి తెరచాటు వ్యవహారాలు ఎలా ఉంటాయో చూపించారు నిజాలు అంత కంటే దారుణంగా ఉంటాయనే సంగతి ఇలాంటి సంఘటనల వల్ల బయటపడుతోంది.  ఫిదా సినిమాలో నటించిన గాయత్రి గుప్తా చెప్పింది అక్షరాలా నిజమే అనిపిస్తోంది కదూ ఇది చదివితే. రంగుల ప్రపంచంలో చీకట్లు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE