గుడ్డి సంతకం హీరో కొంప ముంచింది

Updated By VankayaFri, 06/08/2018 - 11:32
Hero

కొన్నిసార్లు  ఏమరుపాటుతో మనం చేసే పనులు నిట్టనిలువునా మన కొంప ముంచేస్తాయి. ఇప్పుడు ఓ హీరోకి ఇది పర్సనల్ గా అనుభవం అవుతోంది. కెరీర్ లో చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ హీరోని ఆ టైంలోనే ఒక కంపెనీ కలిసింది. తమతో టై అప్ అయితే ఫ్యూచర్ లో మంచి బ్రాండింగ్ అవకాశాలు వచ్చేలా చేసి ఆదాయం కూడా పెంచుతామని మాట తీసుకుని అతనికి నామ మాత్రపు మొత్తాన్ని ముట్టజెప్పి అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేయించుకుంది.

దానికి కాల వ్యవధి కూడా ఐదేళ్లకు పైగా ఉంది. అందులో నియమ నిబంధనలు చదవకుండా వచ్చిన రిప్రెజెంటేటివ్ చెప్పింది నచ్చడంతో ముందు వెనుకా చూడకుండా సంతకం పెట్టేసాడు. ఆ తర్వాత హీరో గారి కెరీర్ ఊహించిన దాని కన్నా వేగంగా ఎగబాకింది. కొన్ని పేరున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే భారీ పారితోషకం ఇస్తామంటూ ఆఫర్స్ ఇవ్వడం మొదలు పెట్టాయి. 

ఇవి చేస్తే అదనపు ఆదాయం వస్తుందని కదా అని భావించిన హీరోకి ఆ సంతకం పెట్టించుకున్న కంపెనీ అడ్డుపుల్ల వేస్తోంది. ఏ లావాదేవీ అయినా తమ ద్వారానే జరగాలి అనే కండిషన్ చూపుతూ సదరు హీరోగారి నోటీసు పంపించింది. దీంతో షాక్ తిన్న హీరో ఏమి చేయలేక తనదగ్గరకు వచ్చిన డీల్స్ అన్ని వాళ్ళ దగ్గరకు పంపుతున్నాడు. ఇప్పుడు హీరో ఏది చేయాలన్నా  వాళ్ళ అనుమతి తప్పనిసరి. ఇతనికి సింగల్ డిజిట్ పర్సెంటేజ్ ఇస్తూ ఆ కంపెని జేబులు నింపుకుంటోంది .

ఆఖరికి తనకు బాగా కావాల్సిన వాళ్ళ షో రూముల ఓపెనింగ్స్ కూడా వెళ్లలేని స్థితికి ఆ హీరోను నెట్టేసింది ఆ సంస్థ. చదవకుండా సంతకం పెట్టినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని, అలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని తనకు సన్నిహితంగా ఉండే అప్ కమింగ్ హీరోలకు చెబుతున్నాడట. అవును మరి. జాగ్రత్తగా ఉండకపోతే మన భుజం మీద చేయి వేసి మాట్లాడుతూ మన మెళ్ళో చైన్ కొట్టేస్తారు. ఇంత కన్నా ఉదాహరణ  కావాలా. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE