హీరోయిన్ కోసం 10 లక్షలు త్యాగం

Updated By VankayaMon, 06/11/2018 - 13:52
 Heroin

టాలీవుడ్ లో కొన్ని విచిత్రాలు భలేగా ఉంటాయి. ముఖ్యంగా ఎఫైర్స్ కి సంబంధించినవి చాలా ఇంటరెస్టింగ్ గా ఉండటంతో పాటు అవునా అనిపించేలా ఉంటాయి. విషయానికి వస్తే అతనొక కుర్ర డైరెక్టర్. మూడు సినిమాలు తీసాడు. రెండు బాగా ఆడాయి. ఒకటి మాత్రం యావరేజ్ మెట్టు దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు నాలుగోది రెడీ చేస్తున్నాడు. అది కూడా మల్టీ స్టారర్. షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. నిర్మాత గత ఏడాది ఆరు సినిమాలు తీసి రికార్డు సెట్ చేసిన అగ్ర శ్రేణి.

హీరోయిన్ ని ఫలానా తీసుకుందామని దర్శకుడు స్ట్రాంగ్ గా రికమండ్ చేసాడు. సరే పోనీలే చెప్పాడు కదా అని నిర్మాత తనను వెళ్లి  అడిగాడు. 50 లక్షలు ఇమ్మని అడిగితే తూర్పు తిరిగి దండం పెట్టుకోమని చెప్పి నిర్మాత వెనక్కు వచ్చేసాడు. తన మార్కెట్ కి 20 లక్షలు ఇవ్వడమే ఎక్కువ అనుకుంటే ఈ డిమాండ్ ఏంటని దర్శకుడి మీద లేచాడు. నేను బ్రతిమాలుకుంటాను అని చెప్పి సదరు హీరోయిన్ ని 30 లక్షలకు ఒప్పించి నిర్మాత ఇచ్చేలా మాట్లాడి తన రెమ్యునరేషన్ లో 10 లక్షలు కత్తిరించుకోమని చెప్పాడట. 

ఇంత త్యాగం ఎందుకయ్యా అంటే ఆ హీరోయిన్ ఉండాల్సిందే అని పట్టు పడుతున్నాడట. అదే గుసగుసలకు దారి తీస్తోంది. ఇటీవలే ఆ హీరోయిన్ ఒక సూపర్ హిట్ హిందీ మూవీ రీమేక్ లో టైటిల్ రోల్  చేస్తోంది. దర్శకుడితో వచ్చిన గొడవ కారణంగా ఏకంగా అతను బయటికి వెళ్లేలా చేసింది. ఇప్పుడు దాన్ని మరో కుర్ర దర్శకుడు టేకప్ చేసాడు. షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉంది. అయినా ఆ హీరోయిన్ మీద పైన చెప్పిన దర్శకుడికి అంత ఆసక్తి ఏమిటో అని నిర్మాత కూడా ఆశ్చర్యపోయాడట.

వేరే ఆప్షన్స్ చాల ఉన్నాయిగా అంటే కూడా వినలేదట. ఖర్చు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే ఆ నిర్మాత సరే నీకిచ్చే డబ్బులో కోత వేసుకుంటే నాకేంటి నీ ఇష్టం అని చెప్పి ఓకే చేసాడట. సో అలా ఈ దర్శకుడు హీరోయిన్ కోసం చేసిన త్యాగం ఫిలిం నగర్ టాక్ గా మారింది. అన్నట్టు తనతో ఈ దర్శకుడు లాస్ట్ మూవీలో ఐటెం సాంగ్ చేయించాడు. ఆ టైం లో ఇచ్చిన మాటే ఇక్కడి దాకా తెచ్చిందని అసలు వార్త. నిజానిజాలు వాళ్ళకే ఎరుక.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE