అంత రాద్ధాంతం జరిగిందా

Updated By VankayaTue, 01/02/2018 - 18:57
heroin-complaint-hero-producer

అతనో స్టార్ కాని స్టార్ హీరో. తక్కువ టైంలోనే స్టార్ డం తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ హీరొయిన్ తెలుగులో స్ట్రెయిట్ గా చేసింది రెండు సినిమాలే. కాని తన నటనతో అందరిని పడగొట్టేసి అసంఖ్యాక అభిమానులను సంపాదించుకుంది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పైగా టాలీవుడ్ లోనే మోస్ట్ క్యాల్కులేటెడ్ నిర్మాత దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఇంకేముంది పోటీ లేని టైం చూసుకుని దుమ్ము దులపడానికి రంగం సిద్ధం అయ్యింది. కాని ఆ హీరోకు, హీరొయిన్ కు మధ్య గతంలో ఏదో గొడవ జరిగిందని, పెద్ద రచ్చ కాబోతుంటే నిర్మాత టైంకి రంగంలోకి దూకి సరిదిద్డారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొంచెం కొంచెం దాని గురించి డీటెయిల్స్ బయటికి వస్తున్నాయి.

 

తెలంగాణాలో ఒక కీలక ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ హీరో తనను వేధించాడని  హీరొయిన్ నిర్మాతకు ఫిర్యాదు చేసిందట. సాక్ష్యంగా అతని ఫోన్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ చూపించిందట. కాని హీరో మాత్రం తన భార్యకు పంపాల్సిన మెసేజ్ పొరపాటున తనకు వెళ్ళింది అని నెత్తి నోరు బాదుకున్నా వినకుండా ఇష్యూ చేయబోతే సదరు ప్రొడ్యూసర్ వచ్చి మంచి ఫాం వస్తున్న టైం లో ఇలాంటి గొడవల్లో ఇరుక్కుంటే అవకాశాలకు గండి పడుతుందని హెచ్చరించడంతో వెనక్కు తగ్గినట్టు టాక్. 

హీరోతో కూడా ఇలాంటి విషయాల జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ ఒక్క కారణంతోనే ఆ హీరొయిన్ కొత్త తెలుగు సినిమా ఆఫర్లు ఎన్ని వచ్చినా రిజెక్ట్ చేసిందట. ఏదేమైనా ఒక సినిమాలో కలిసి నటిస్తున్న ఇద్దరి మధ్య ఇలాంటి అపార్థాలు రావడం మంచిది కాదు.  

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE