రైడ్ లో హీరొయిన్ 20 లక్షలు గోవిందా

Updated By VankayaWed, 02/21/2018 - 10:36
Heroin

మొన్న సంక్రాంతికి వచ్చిన సూర్య గ్యాంగ్ మూవీ చూసారుగా. అందులో నకిలీ సిబిఐ ఆఫీసర్స్ రూపంలో హీరో టీం ఇన్కం టాక్స్  రైడ్లు చేస్తూ బడా బాబుల దగ్గర డబ్బులు దస్కం దోచేస్తూ ఉంటారు. సరిగ్గా అలాంటి నాటకీయ ఫక్కీలో జరిగిన ఒక సంఘటన ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లో బాగా పేరున్న ఒక స్టార్ హీరొయిన్ ఇటీవలే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో బస తీసుకుంది.

తనను ప్రత్యేకంగా కలవడానికి నగరంలో పేరుమోసిన బడా వ్యాపారవేత్తలు రావడం అక్కడున్న వారికీ ఆశ్చర్యం కలిగించలేదు. కారణం వారిలో ఎవరైనా సినిమా తీసుకునే ప్లాన్ లో ఉన్నారేమో అని. కాని అసలు రహస్యం వేరే ఉంది. తనను కలవడానికి వచ్చి ప్రత్యేకంగా తనతో కొద్ది గంటలు గడపాలి అని కోరుకునే వారి కోసం 20 లక్షల ప్యాకేజీతో సదరు హీరొయిన్ ఆఫర్స్ ఇస్తుందట.

ఇంకేముంది బిజినెస్ సర్కిల్ లో పేరుమోసిన ఒక బిగ్ షాట్ ఆ ఒప్పందానికి సై అని చెప్పి కాష్ మొత్తం నగదు రూపంలో తీసుకెళ్ళి తన పని కానిచ్చాడు. కాసేపు అయ్యాక పోలీసు రైడింగ్ జరగబోతోంది అని కొందరు హడావిడి చేయటంతో ఆ హీరొయిన్ వెంటనే అక్కడి నుంచి తన బ్యాగ్, రెగ్యులర్ లగేజీ కూడా అక్కడే వదిలేసి ఉన్న బట్టల్లోనే అక్కడి నుంచి పారిపోయింది. దీంతో వచ్చిన టీంకు అక్కడ స్పాట్ లో 20 లక్షలు డబ్బులు దొరికేసాయి. నిజానికి వాళ్ళు ఒరిజినల్ పోలీసులు కాదు. సదరు బిజినెస్ మెన్ మీద ఉన్న వ్యక్తిగత కక్షతో ఉన్న ప్రత్యర్థులు అతన్ని భయపెట్టే పధకంలో భాగంగా ఈ స్కెచ్ వేసారు. కాని అతను వెళ్ళిపోయాక ఈ డూప్లికేట్ టీం దాడి చేయటంతో డబ్బులు మాత్రమే దొరికాయి.

తరువాత విషయం తెలుసుకుని ఖంగు తిన్న ఆ హీరొయిన్ తన స్టాఫ్ ని పంపించి రూమ్ ఖాళీ చేయించి వస్తువులు వెనక్కు తెప్పించుకుంది. డబ్బు గురించి మాత్రం తేలు కుట్టిన దొంగలా అడగకుండా వదిలేసింది. సిసి కెమెరాలలో చూసే అవకాశం ఉన్నా కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు అనే వివరాలు పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది కనక ఆ డబ్బు మీద ఆశలు వదిలేసుకుందట. మొత్తానికి సినిమా థ్రిల్లర్ ను తలపించే రీతిలో జరిగిన ఈ సంఘటన ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE