హీరొయిన్ ఛాన్స్ అలా వచ్చిందా?

Updated By VankayaThu, 05/10/2018 - 09:52
Heroine chance getting like that

రేపు విడుదల కానున్న దర్శకుడి కొడుకు డెబ్యు మూవీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆసక్తి రేపెలా ఉండటంతో చాలా కాలం నుంచి ఫాంలో లేని ఆ డైరెక్టర్ హిట్ కొడతాడు అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇకపోతే హీరొయిన్ కు కూడా అదే డెబ్యు మూవీ. కాని తన సెలక్షన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉందని తెలిసింది. దీనికి కొత్త హీరొయిన్ కోసం వెతుకుతున్నారు అని తెలిసినప్పుడు హీరో కం సదరు దర్శకుడి కొడుకు నుంచి స్వయానా ఒక రికమండేషన్ వచ్చిందట.

ఎవరా అని తరచి చూస్తే అతని క్లాస్ మేట్ లవర్ ఆ అమ్మాయి. ఆ క్లాస్ మేట్ టాలీవుడ్ ప్రముఖ హీరొయిన్ కు స్వయానా తమ్ముడు. నిన్నా మొన్నటి దాకా ఆ స్టార్ హీరోల సరసన వరస బెట్టి చేసిన ఆ స్టార్ హీరొయిన్ కు ఇప్పుడు ఇక్కడ అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే బాలీవుడ్ లో ఒక ట్రయిల్ వేసింది కాని అంతగా వర్క్ అవుట్ కాలేదు . ఇప్పుడు ఈవిడ తమ్ముడే తన లవర్ ని సినిమాల్లో పరిచయం చేయమని అడగటంతో ఈ కొత్త హీరో నాన్నను ఒప్పించాడు.

ఇదీ ఇప్పుడు తాజాగా చక్కర్లు కొడుతున్న అప్ డేట్. నిజమో కాదో కాని మొత్తానికి ఇంకా పూర్తి స్థాయి హీరోగా టాలీవుడ్ లో మొదటి సినిమా విడుదల కాకుండానే ఏకంగా హీరొయిన్ ను ఫలానా తీసుకోమని రికమండ్ చేసే దాకా వచ్చాడు అంటే కుర్రాడు గట్టివాడే అనుకుంటున్నారు అందరు. ఇప్పుడు పరిచయం అవుతున్న కొత్త హీరొయిన్ కు ఆ స్టార్ హీరొయిన్ తమ్ముడితో ఎప్పటి నుంచో లవ్ ట్రాక్ నడుస్తోందట. సదరు తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు.

కాకపోతే మంచి బ్యానర్ లో ఇతన్ని పరిచయం చేయాలనీ ఆ స్టార్ హీరొయిన్ ప్రయత్నిస్తోంది కాని సరైన దర్శక నిర్మాత దొరక్క అంతకంతకు వాయిదా పడుతూ పోతోందని తెలిసింది. తనది ఎలాగూ లేట్ అవుతోంది కాబట్టి కనీసం తన గర్ల్ ఫ్రెండ్ అయినా ఫీల్డ్ లోకి వెళ్ళిపోతే తాను తర్వాత రావొచ్చని ఇలా చేసినట్టు తెలిసింది. మొత్తానికి ఒక కొత్త హీరొయిన్ పరిచయం వెనుక కూడా ఇంత పెద్ద స్టొరీ ఉంటుందా అని ఆశ్చర్య పోతున్నారు ఇది విన్నవాళ్ళు. అంతే మరి టాలీవుడ్ తెరవెనుక కథలు అంటే అలాగే ఉంటాయి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE