చికాగో సెక్స్ స్కామ్ - కాపాడండి ప్లీజ్

Updated By VankayaWed, 06/27/2018 - 13:25
Star Heroin

కిషన్ దంపతులు అమెరికాను వేదికగా చేసుకుని నడిపిన సెక్స్ భాగోతం ప్రస్తుతానికి చల్లారినట్టు కనిపిస్తున్నా అక్కడ విచారణ చేస్తున్నది మన పోలీసులు కాదు కాబట్టి అంతర్గతంగా నివేదికలు సిద్ధమైపోతున్నాయి. అందులో ప్రమేయం ఉన్నట్టుగా చెప్పబడుతున్న కొందరు హీరోయిన్లు యాంకర్ల పేర్లు త్వరలో వెల్లడి కావచ్చు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అందులో నుంచి బయటపడే మార్గం కోసం వాళ్లంతా ఇన్ఫ్లుయెన్స్ కోసం తిరుగుతున్నారు.

ముఖ్యంగా అందులో ఉన్న ఒక హీరోయిన్ తనను ఎలాగైనా కాపాడమని ఒక అగ్ర నిర్మాత చుట్టూ ప్రదక్షిణ చేస్తోందట. ఇలాంటి వ్యవహారాలు చక్కదిద్దడంలో ఎక్స్ పర్ట్ అయిన సదరు ప్రొడ్యూసర్ ఇది ఇంకా రచ్చ కాకుండా చూసేందుకు మార్గాలు వెతుకుతున్నట్టు తెలిసింది. అమెరికా చట్టాల మీద అవగాహన ఉన్న లాయర్లను సంప్రదించి పేర్లు బయటపడకుండా ఏదైనా చేసే అవకాశాల గురించి తీవ్ర స్థాయిలో చర్చకు జరుపుతున్నట్టు వినికిడి . 

మరోవైపు అమెరికా విజిట్ ప్లాన్ చేసుకున్న టాలీవుడ్ తారలకు కారణం ఏదైనా సరే వీసా కోసం చుక్కలు చూస్తున్నారు. గతంలో జారీ చేస్తున్న వాటిలో సుమారు 40 శాతం పైగా కొత్త వేయడంతో ఈవెంట్స్ వెళ్లడం కుదిరేలా లేదు. చికాగో రాకెట్ తో ఏ సంబంధం లేకపోయినాతెలుగు సంఘాలు నిర్వహిస్తున్న వేడుకను కారణంగా చూపిస్తే చాలు తిరస్కరణకు గురవుతున్నారు. దీనికి ఏం చేయాలో కూడా ఇండస్ట్రీ పెద్దలకు అంతు చిక్కడం లేదు.

ఆ హీరోయిన్ మాత్రం తన పేరు ఎలాగైనా రాకుండా చేయమని ఖర్చైనా పర్వాలేదు అని వేడుకుందని సమాచారం. ఇంతా చేసి తానేమి టాప్ రేంజ్ స్టార్ హీరోయిన్ కాదు. చేసిందే ఐదు సినిమాలు. బ్లాక్ బస్టర్ కూడా లేదు. అయినా ఇలా బుక్ అయిపోవడంతో బయటికి వచ్చే మార్గం లేక సతమతమవుతోంది. చికాగో రాకెట్ మీద వర్మ ఏదైనా సినిమా తీస్తే బాగుటుంది అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో మొదలైపోయాయి. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE