హీరోయిన్ కోసం తమ్ముడి వార్నింగ్

Updated By VankayaWed, 06/13/2018 - 10:46
Heroine's brother warns to young director

సినిమాల్లో సీరియల్స్ లోనే అనుకుంటాం కానీ అంతకు మించిన డ్రామా నటీనటుల లైఫ్ లో ఉంటుంది. ఎవరి దాకా ఎందుకు మహానటి చూసాక సావిత్రి గారి జీవితంలోకి జెమిని గణేషన్ ఎంట్రీ ఇచ్చిన విధానం చూసి అందరు షాక్ తిన్నారు కూడా. ఇక అసల  విషయానికి వస్తే  అతనొక యంగ్ డైరెక్టర్. ఒక హీరోయిన్ ని ఇష్టపడ్డాడు. అతను తీస్తున్న సినిమాలో తనేమి నటించడం లేదు. అంతకు ముందు చేసారు. హిట్ కూడా అయ్యింది. కానీ సదరు హీరోయిన్ ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

దాని వెనుక ఈ కుర్ర దర్శకుడు కూడా ఉన్నాడు. అలా అలా ఇద్దరి మధ్య చనువు పెరిగింది. కానీ ఆ హీరోయిన్ ఏనాడూ ఈ దర్శకుడిని వేరే కోణంలో చూడలేదు. జస్ట్ ఫ్రెండ్ లాగా భావించింది. కాని ఆ డైరెక్టర్ అదో టైపు. తన ఫోన్ నెంబర్ తీసుకుని కాల్స్ చేయటం, మెసేజీలు పంపడం, వీడియో చాట్ చేయమని కోరడం ఇలా రకరకాలుగా తన పైత్యం చూపించడం మొదలుపెట్టాడు. ఓ స్టేజి వరకు భరించిన హీరోయిన్ కు ఇక అంతకు మించి తట్టుకోవడం వల్ల కాలేదు. 

విషయాన్నీ నేరుగా తన తమ్ముడికి చెప్పేసింది. మనోడు ఊరుకుంటాడా. ఫ్రెండ్స్ బ్యాచ్ ని వేసుకుని పక్కా స్కెచ్ తో ఆ దర్శకుడిని ఒక పబ్ లో పట్టేసుకున్నాడు. హిట్లర్ లో చిరంజీవి రేంజ్ లో నా అక్క జోలికి వస్తే తోలు తీస్తే అని సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో దెబ్బకు ఆ దర్శకుడు కొద్దీ రోజులు సైలెంట్ అయ్యాడు. కానీ అప్పుడప్పుడు మళ్ళి కొనసాగిస్తూనే ఉన్నాడు.

తమ్ముడికి వాడిని  కొట్టి పోలీస్ స్టేషన్ లో పట్టివ్వాలి అన్నంత కోపం వస్తున్నా హీరోగా త్వరలో తెరంగేట్రం చేసే పనిలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు చిక్కుల్లో నెడతాయి అని గుర్తించి అక్కనే వద్దని వారించి చెప్పిందట. ఏదో కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడినందుకే ఇలా వేధించడం బాగాలేదని ఇతన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక అక్కా తమ్ముళ్లు ఆలోచనలో పడ్డారట. అంతే మరి. సినిమాల్లో చూస్తాం కానీ విపరీతమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు నిజ జీవితంలోకి వస్తే ఇలాగే ఉంటుంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE