రాజశేఖరా? ఎలా కుదురుతుంది బాసూ

Updated By VankayaThu, 05/17/2018 - 16:10
How it is possible Rajshekar in Uday kiran biopic

ఇవాళ మధ్యాన్నం నుంచి ఉదయ్ కిరణ్ బయోపిక్ కు సంబంధించిన వార్త కొత్త కలకలం రేపుతోంది. ఇందులో రాజ శేఖర్ చిరంజీవి పాత్రలో నటించబోతున్నట్టు ఉదయ్ కిరణ్ ను ఆయనకు కాబోయే అల్లుడు కావడం మిస్ అయ్యే ఎపిసోడ్ ని కీలకంగా చూపిస్తూ దాన్ని హై లైట్ చేయబోతున్నట్టు రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ప్రచారం చేస్తున్న వాళ్ళు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు.

గత ఏడాది విడుదలైన గరుడవేగా ప్రమోషన్స్ లో రాజశేఖర్ చాలా స్పష్టంగా తనకు చిరంజీవి కున్న గ్యాప్ ఇకపై ఉండదని అనవసరంగా అభిమానులే అపార్థం చేసుకున్నారని మేము మేము ఒకటే అని చాలా విషయాలే చెప్పారు. అప్పుడెప్పుడో కూతురి మెడికల్ కాలేజీ రికమండేషన్ కోసం చిరు ఇంటికి సతీ సమేతంగా వెళ్ళడం గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. సో ఉదయ్ కిరణ్ లైఫ్ లో చిరుకి ఇబ్బందికరంగా అనిపించే ఆ ఎపిసోడ్ లో రాజశేఖర్ కోరి మరీ వివాదం కోసం నటించే అవకాశాలు దాదాపు లేవు.

దానికి తోడు నేనే రాజు నేనే మంత్రి కథను తేజ ముందుగా అహం పేరుతో రాజశేఖర్ కే విన్పించాడు. కాని ఇద్దరికీ ఈగో క్లాషేస్ వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో మొత్తానికి ఆ ప్రాజెక్ట్ పట్టాలు మారి రానా చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ గ్యాప్ ఇద్దరి మధ్య అలాగే ఉందని ఫిలిం నగర్ టాక్. అలాంటప్పుడు చిరుతో ఇప్పుడు కుదిరిన సయోధ్య మీద ప్రభావం చూపేలా కోరి మరీ ఉదయ్ కిరణ్ బయో పిక్ లో రాజశేఖర్ నటించడం అంటే జీవిత కూడా ఒప్పుకోకపోవచ్చు.

సినిమా రంగంలో ఇది ఇలాగే జరగాలి అన్న రూల్ ఏమి లేదు కాని తనతో అండర్ స్టాండింగ్ కుదరని తేజ కోసం పాత స్నేహాన్ని తిరిగి మొదలుపెట్టిన చిరుని రాజశేఖర్ వదులుకుంటాడా అంటే ఎలా చూసుకున్నా సమాధానం నో అనే వస్తుంది. కాబోయే అల్లుడు టైటిల్ నిజమే కాని అది దీనికి కాకపోవచ్చని ఉదయాన్నే చెప్పాం. అసలు ట్విస్ట్ ఏంటంటే అమెరికాలో ఉన్న రానా రాగానే అతనితో కొత్త సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు తేజ. ఇదంతా ఊసుపోక జరుగుతున్న ప్రచారంగా చెప్పుకోవచ్చు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE