శిరీష హ‌త్య కేసులో మ‌జీద్

Updated By VankayaMon, 05/14/2018 - 18:16
Hyderabad girl sirisha murder case dcp padmaja briefs media

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి  విద్యార్థిని హత్య కేసులో నిందితులు ఒక్క‌రు కాదు ఇద్ద‌ర‌ని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివారు శంకరపల్లి ప్రగతి రిసార్ట్స్‌లో డిగ్రీ విద్యా ర్థిని శిరీష(20) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శంషాబాద్ డీసీపీ ప‌ద్మ‌జ చెప్పిన వివ‌రాల ఆధారంగా  2011 నుంచి శిరీష, సాయిప్రసాద్‌కు పరిచయం ఉందని, శంషాబాద్‌లోని చైతన్య జూనియర్ కాలేజీలో వీరిద్దరూ చదివారని పద్మజ వెల్లడించారు. వీరిద్దరి ఊర్లు కూడా ఒకరిది తిమ్మాపూర్, మరొకరిది తిమ్మాపూర్ రైల్వే గేట్ అని.. రెండు ఊళ్లకు మధ్య దూరం ఒకటిన్నర కిలోమీటర్ దూరం కావడంతో రోజూ కాలేజీకి కలిసి వెళ్లొచ్చేవారని అన్నారు.

దీంతో వీళ్లిద్దరి మధ్య స్నేహం.. ఆ తరవాత ప్రేమ చిగురించిందని చెప్పారు. అయితే ఇంట్లో విషయం తెలియడంతో మందలించి శిరీష వాడుతున్న ఫోన్ కూడా తీసేసుకున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు డిగ్రీలో చేరాక వీళ్లిద్దరూ మళ్లీ స్నేహాన్ని మొదలుపెట్టారని చెప్పారు.  శిరీషకు ఎవరు ఫోన్ చేసినా ఆమె ఎవరితోనూ సంబంధం పెట్టుకుందనే బలమైన అనుమానం సాయిప్రసాద్ ఉండేదన్నారు. ఆ అనుమానంతోనే శిరీష‌ను హ‌త్య చేయాల‌ని సాయిప్ర‌సాద్ కుట్ర‌ప‌న్నాడు. 

కుట్రప్ర‌కారం  సాయిప్రసాద్‌ ఆమెతో మాట్లాడాలి అని చెప్పి శంషాబాద్‌కు రావాలని ఫోన్‌ చేశాడు. అదే సమయంలో అతడు ప్రగతి రిసార్ట్స్‌లో ఆన్‌లైన్‌లో కాటేజ్‌ బుక్‌ చేసి ఆమెను నేరుగా రిసార్ట్స్‌కు తీసుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో శిరీషను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసాడు. ఆమె నిరాకరించింది. బాత్రూమ్‌కు వెళ్లిన ఆమెపై వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు అని పద్మజ వివరించారు. దీంతో తొల‌త శిరీష హ‌త్య కేసులో సాయి ప్ర‌సాద్ నిందితుడు ఒక్క‌డేన‌ని అంద‌రు అనుకున్నారు. కానీ సాయి ప్ర‌సాద్ కాల్ డేటాపై పోలీసులకు అనుమానం రావ‌డంతో కేసులో ఇద్ద‌రు నిందితులు ఉన్నార‌ని గుర్తించారు.  
సాయిప్రసాద్ స్వగ్రామం కొత్తూరు మండలం తిమ్మాపురం. అదే గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ హత్య సమయంలో సాయిప్రసాద్‌కు సహకరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. శిరీషను, ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ను మజీద్ తన కారులో రిసార్టుకు తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. అంతేకాదు శిరీష హ‌త్య అనంత‌రం మ‌జీద్ తాను వెంట తెచ్చుకున్న కారులో పారిపోయిన‌ట్లు పోలీసులు జ‌రిపిన విచార‌ణ‌లో తేలింది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE