హైద‌రాబాద్ మెట్రో రైలు ఖాళీ..!

Updated By VankayaWed, 02/14/2018 - 11:33
Hyderabad metro rail

న‌గ‌రంలో ట్రాఫిక్ క‌ష్టాల నుంచి ప్ర‌యాణికుల్ని గ‌ట్టెంక్కించేందుకు ఎల్ ఆండ్ టీ నిర్మాణంలో  మెట్రో రైలు వ‌చ్చిన విష‌యం తెలిసింది. మెట్రో రైలు ప్రారంభంలో రోజుకు ల‌క్ష‌మందికి పైగా న‌గ‌ర వాసులు ప్ర‌యాణించారు. కానీ రోజులు గ‌డిచే కొద్ది మెట్రో రైలులో ప్ర‌యాణించే వారు క‌రువ‌య్యారు. మొద‌ట్లో జాయ్ రైడ్స్ ను ఎంజాయ్ చేసిన ప్ర‌యాణికులు ఇప్పుడు లేక‌పోవ‌డం మెట్రో అధికారుల్ని విస్మ‌యానికి గురిచేస్తుంది. ప్రారంభ‌మై రెండు నెల‌ల‌కే ఇలాంటి పరిస్థితి ఎందుకు వ‌చ్చింది అనే విష‌యంపై ఆరా తీస్తే  అనేక కార‌ణాలు ఉన్న‌ట్లు ప్ర‌యాణికులు చెబుతున్నారు.  

బ‌య‌ట‌కి త్రిశంకు స్వ‌ర్గంలా క‌నిపించే మెట్రో రైలులో ప్రయాణించాలంటే ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌ల క‌న‌బ‌డుతున్నాయంటూ న‌గ‌ర వాసులు వాపోతున్నారు. అటు నాగోల్ నుంచి ఇటు మియాపూర్ వ‌ర‌కు మెట్రో రైలు సౌక‌ర్యం ఉన్నా ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించేందుకు మ‌క్కువ చూపుతున్నారు. ఏదో స‌ర‌దాకి వారంత‌పు రోజుల్లో ప్ర‌యాణించేందుకు ఇష్టప‌డుతున్నా ఆఫీసు వేళల్లో మెట్రోలో ప్ర‌యాణించాలంటే జ‌డుసుకుంటున్నారు. 

న‌గ‌ర రోడ్ల‌పై ట్రాఫిక్ ఒక్క‌టే క‌ష్టంగా ఉంటుంద‌ని మిగిలిన అంశాల్లో మెట్రో ప్ర‌యాణం కంటే బ‌స్సుల్లో ప్ర‌యాణం మేల‌ని అంటున్నారు  ఓ వైపు మెట్రోలో ప్ర‌యాణ ఛార్జీలు అధికంగా ఉండ‌డం మెట్రో న‌డిచే మార్గాల్లో స‌మ‌య పాల‌న లేక‌పోవ‌డం ఉమ్మ‌డి టికెట్లు నెల‌వారి మెట్రోపాస్ లు లేక‌పోవ‌డం మెట్రోరైలును నిర్మించిన ఎల్ అండ్ టీ కి  290 ఎకరాల స్థలంలో వేల‌కోట్లు యాడ్స్ రూపంలో ఆదాయం వ‌స్తున్నా ఢిల్లీ మెట్రో కంటే మన దగ్గర టికెట్ పై పెద్ద‌మొత్తంలో వ‌సూలు చేస్తున్నారు.

దీనికి తోడు  బెంగళూరు, చెన్నై, ముంబై, కొచ్చి, జైపూర్‌.. ఇలా ఏ మెట్రో ప్రాజెక్టును తీసుకున్నా వాటికి మించిన ధరలు హైద‌రాబాద్ లో ఉన్న‌ట్లు స‌మాచారం దానికి నిదర్శ‌న‌మే  దాని ఫలితమే మూడు నెలలు గడవకముందే మెట్రో ప్రయాణం అంటేనే  అమ్మో అంత ధరా  అని భయపడే పరిస్థితి వ‌చ్చింద‌ని న‌గ‌ర‌వాసులు చెబుతున్నారు.  

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE