క‌నుచూపు సైగ భామ‌పై పోలీసుల‌కు ఫిర్యాదు

Updated By VankayaWed, 02/14/2018 - 11:06
Hyderabad youth files complaint against internet sensation Priya Prakash Varrier

క‌నుచూపు సైగ‌తో కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న మ‌ళ‌యాళ‌న‌టి ప్రియా వారియ‌ర్ పై అబ్దుల్ అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారియ‌ర్ ‘ఒరు ఆదార్ లవ్’ అనే మ‌ళ‌యాళం  సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆ పాట‌లో వారియ‌ర్ ముస్లీంల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా యాక్ట్  చేసిందంటూ ఫ‌ల‌క్ నుమా ఫ‌రూక్ న‌గ‌ర్ కు చెందిన అబ్దుల్ తో పాటు మ‌రి కొంత‌మంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులో ఒరు ఆదార్ ల‌వ్ కు సంబంధించిన ఐదు నిమిషాల నిడివిగ‌ల వీడియోను సాక్ష్యంగా చూపిస్తూ అందులో ఉన్న కొన్ని సీన్లు త‌మ‌కు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని..త‌క్ష‌ణ‌మే వారియ‌ర్ పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేయాల‌ని పిటీష‌న్ లో పేర్కొన్నారు. అయితే పిటిష‌న్ ను స్వీక‌రించిన ఫ‌ల‌క్ నుమా పోలీసులు సంబంధిత వీడియోను వీక్షించి అభ్య‌త‌రక‌రంగా ఉంటే న్యాయ‌నిపుణ‌లు స‌ల‌హా మేర‌కు కేసు ఫైల్ చేస్తామ‌ని సూచించారు. అనంత‌రం ఆ వీడియోపై చ‌ర్య‌లు తీసుకునేలా  ఆ చిత్ర యూనిట్ తో సంప్ర‌దించి అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాల్ని తొల‌గించేలా ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఆ ఫిర్యాదు పై వారియ‌ర్ స్పందించిన‌ట్లు స‌మాచారం. క‌థకు త‌గ్గ‌ట్లు తాను యాక్ట్ చేసిన‌ట్లు , కావాల‌ని అలా చేయలేద‌ని పోలీసుల‌కు తెలిపిన‌ట్లు తెలుస్తోంది.అబ్దుల్ ఫిర్యాదు ఆమె అభిమానులు ఖండిస్తున్నారు. ఓవ‌ర్ నైట్ స్టార్ ఢం సంపాదించిన వారియ‌ర్ ను చూసి ఓర్వ‌లేక ఇలా ఫిర్యాదు చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా దీపికా ప‌దుకొణే న‌టించిన ప‌ద్మావ‌త్ సినిమాలో త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని రాజ్ పుత్ వ‌ర్గీయులు ఆందోళ‌న చేశార‌ని, సినిమా విడుద‌ల త‌రువాత ఆ సామాజిక వ‌ర్గంవారిని కించ‌ప‌రిచేలా ఎలాంటి స‌న్నివేశాలు లేవ‌ని సూచించారు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE