ఇది నా లవ్ స్టొరీ- రివ్యూ

Updated By VankayaWed, 02/14/2018 - 16:22
Idi Naa Love Story

ఒకప్పుడు లవర్ బాయ్ గా యూత్ ఐకాన్ గా ఉన్న తరుణ్ అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ కు దూరమై బిజినెస్ లో పడిపోయాడు. గ్యాప్ వస్తే వచ్చిందిలే పెద్ద పెద్ద సీనియర్ హీరోలే రాగా లేనిది నేను వస్తే ఏంటి అనుకున్నాడో ఏమో ఇన్నేళ్ళ తర్వాత ఇది నా లవ్ స్టొరీతో మన ముందుకు వచ్చాడు తరుణ్. రమేష్ గోపి దర్శకత్వంలో ప్రకాష్ నిర్మించిన ఈ మూవీకి శ్రీనాద్ విజయ్ సంగీత దర్శకుడు. మరి అసలు అంచనాలే లేకుండా విడుదలైన విషయం కూడా బయటికి రాకుండా వచ్చేసిన ఈ మూవీ రివ్యూ చూద్దాం.

పేరుకు తగ్గట్టే ఇది లవ్ స్టొరీనే కాని ప్రేక్షకులు ఆశించే లవ్ లేని ఒక బేస్ లెస్ స్టొరీ ఇది. రాంగ్ ఐడెంటిటీతో గతంలో క్రైమ్ మూవీస్ వచ్చాయి కాని లవ్ మీద రాలేదు. అలా రాసుకుంటే కొత్తగా అనిపిస్తుంది అని ఫీల్ అయ్యాడు కాబోలు రమేష్ గోపి అలాంటి ప్రయోగమే ఇందులో చేసాడు. యాడ్ ఫిలిమ్స్ డైరెక్టర్ అభి తొలిచూపులో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని తను మిస్ అవుతుంది. సరే తన చెల్లెలి బలవంతం మీద మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతాడు. కాని ఇద్దరు ఒకటే అని తెలుసుకుని ఉక్కిరి బిక్కిరి అవుతాడు. కాని తర్వాత ఫస్ట్ లవ్ ఈ అమ్మాయి ఒకటే కాదని తెలుసుకుని షాక్ అవుతాడు. తర్వాత వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి హీరో చిక్కుల్లో పడతాడు. మరి ఈ డబుల్ ఫోటో హీరొయిన్లు ఎవరు ఆ ట్విస్ట్ ఏంటి అనేది వెండితెరపై చూడాల్సిందే

తరుణ్ ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా తన స్టైల్ లో పాత్రను పండించే ప్రయత్నం చేసాడు. తన వరకు ఏ లోపం లేదు. ఎనర్జీ కూడా బాగా క్యారీ చేస్తూ ఎక్కడా తన నటన మీద కంప్లయింట్ రాకుండా చూసుకున్నాడు. ఒవియా తమిళ్ లో క్రేజ్ ఉంది కాని ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి జస్ట్ ఓకే అనిపిస్తుంది. పాత్రలో డెప్త్ ఉన్న బిల్డప్ ఇచ్చినా అది తేలిపోయింది. సినిమా మొత్తం రెండు పాత్రలే చుట్టే తిప్పడంతో ఇంకెవరి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయింది.

దర్శకుడు రమేష్ గోపి వృధా ప్రయత్నం చేసాడు. గ్రిప్ లేని కథా కథనాలతో విసుగు పుట్టించాడు. పంచ్ డైలాగులు, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే జోకులు తీసుకుని ఊరికే పేజీలు  పేజీలు  రాసుకుంటూ పోయాడే తప్ప ఇవి బాగా ఓవర్ అయ్యాయి అనే ఫీలింగ్ ఎక్కడా కలగకపోవడం విశేషం. కొన్ని చోట్ల నవ్వించినా అసలు కథ ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో అర్థం కాక సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. పాటలు కూడా అంతంత మాత్రంగా ఉండటం, తరుణ్ ని హీరోగా చూసి చాలా కాలం కావడం ఇవన్ని నెగటివ్ గానే మారాయి. ఎడిటింగ్ మాత్రం తీసికట్టుగా ఉంది..

తనకు కం బ్యాక్ మూవీలా ఉపయోగపడుతుంది అనుకున్న సినిమా కాస్త గో బ్యాక్ మూవీలా మారింది తరుణ్ కు. సినిమాలో ఏ మాత్రం విషయం ఉన్నా పోనిలే సీనియర్ యూత్ హీరో అనే రెస్పెక్ట్ తో భరించేవాళ్ళు ప్రేక్షకులు. కాని దర్శకుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రెండు గంటలు థియేటర్లో కూర్చోవడమే కష్టం అనిపించేలా కామెడీ పంచులతో విసిగించి పరిగెత్తించి చివరికి సారీ తరుణ్ చెప్పించే దాకా వదలలేదు. మొన్న శుక్రవారం తొలిప్రేమ కంటెంట్ తో పడగొడితే ఈ లవ్ స్టొరీ మాత్రం తరిమి తరిమి కొట్టింది

ఇది నా టార్చర్ స్టొరీ

రేటింగ్ : 1.75/5

 

In English :

Tharun's Idi Naa Love Story Movie Review!!​​​​​​​

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE